'కిక్' సినిమా తర్వాత బాగా కిక్కిచ్చే చిత్రం..రవితేజ
"నేను చేసిన 'కిక్' సినిమా తర్వాత బాగా కిక్కిచ్చే పాటలు 'మిరపకాయ్'లో ఉన్నాయి..నా సినిమా అని కాదు కానీ...నిజంగానే ఇందులో పాటలు చాలా బాగున్నాయి అంటున్నారు రవితేజ. ఆయన తాజా చిత్రం 'మిరపకాయ్' ఆడియో పంక్షన్ ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తొలి క్యాసెట్ ను ఆవిష్కరించి మరో దర్శకుడు వివి వినాయక్ అందించారు. అలాగే తొలి సీడీని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ విడుదల చేయగా దర్శకుడు రాజమౌళి స్వీకరించారు. అనంతరం చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ "మా నిర్మాతలు చెప్పిన సమయం కంటే ఇరవై రోజులు ముందుగానే సినిమాను పూర్తిచేశాం. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్నీ మాస్ మహరాజ్ రవితేజ. ఆయన చెప్పిన టైటిలే 'మిరపకాయ్'. తమన్ చక్కటి సంగీతం అందించాడన్నారు. రమేష్ పుప్పాల నిర్మించిన ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ, దీక్షాసేథ్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. రవితేజ మాట్లాడుతూ "నాకు బాగా ఇష్టమైన వ్యక్తి హరీష్ శంకర్. తనలో మంచి నటుడున్నాడు. నా కోసం కాకపోయినా హరీష్ కోసం ఈ సినిమా ఆడాలి అన్నారు.


Click it and Unblock the Notifications











