పైకి రొమాంటిక్ రుషి..లోపల (మిరపకాయ్ ప్రివ్యూ)
"ప్రేమ అనేది పేడ లాంటిది. గుండ్రంగా చుడితే గొబ్బెమ్మ అవుతుంది. నీళ్లలో కలిపితే కల్లాపి అవుతుంది. గోడకి కొడితే పిడక అవ్వుద్ది"...అనే అభిప్రాయం రుషి (రవితేజ)ది. అతనికి ప్రేమ మీద ఈ భిన్నమైన అభిప్రాయం చాలామందికి కొరుకుడుపడదు. అయితే విచిత్రం ఏమిటంటే ఆ భిన్నాభిప్రాయం మూలంగానే అతను ఓ అందాల భామతో ప్రేమలోపడతాడు. ఆ ప్రేమ వ్యవహారంతో అనుకోని విధంగా ఒక పెద్ధ వ్కక్తితో తలపడాల్సి వస్తుంది. ఫలితంగానే రుషి లక్ష్యం కూడా నెరవేరుతుంది. అలాగే ఆ ప్రేమకథలో వినమ్ర (రిచా), వైశాలి (దీక్ష) పాత్రలు కూడా కీలకమే. అలాగే చిత్రంలో ఊహించని ట్విస్టు ఉంటుంది. ఇక ఈ చిత్రం గురించి దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ...రవితేజ క్యారక్టరైజేషన్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. మిరపకాయ్ కొరికితే ఎంత ఘాటుగా ఉంటుందో...ఆ పాత్ర కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. ప్రకాష్ రాజ్, కోటల నటన సినిమాలో హైలెట్ గా ఉంటుంది. ఇక ఇప్పటికే తమన్ సంగీతం అంతటా మారు మ్రోగుతోందన్నారు.
సంస్థ: ఎల్లో ఫ్లవర్స్
నటీనటులు: రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్ష సేథ్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, సునీల్, చంద్రమోహన్, అలీ, సురేఖావాణి, అజయ్, సుధ తదితరులు.
సంగీతం: తమన్
నిర్మాత: రమేష్ పుప్పాల
దర్శకత్వం: హరీష్ శంకర్.ఎస్.


Click it and Unblock the Notifications











