రవితేజ 'మిరపకాయ్' చిత్రం విడుదల ఎప్పుడంటే...
రవితేజ, రిచా గంగోపాధ్యాయ్, దీక్ష కాంబినేషన్ లో రూపొందుతున్న 'మిరపకాయ్' చిత్రం డిసెంబర్ రెండువ వారంలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేశ్ పుప్పాల నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం యూరప్ లో పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. గతంలో రవితేజతో షాక్ చిత్రం డైరక్ట్ చేసిన హరీశ్ శంకర్ ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇక ఈ చిత్రం ప్రోగ్రెస్ గురించి నిర్మాత రమేశ్ మీడియాకు తెలియజేస్తూ...బ్యాంకాక్ లో పన్నెండు రోజుల పాటు భారీ ఎత్తున చిత్రీకరించిన క్లైమాక్స్ చాలా గొప్పగా వచ్చింది. ఈ నెల మూడు నుంచి పద్నాలుగు రోజులపాటు యూరప్‌లోని జర్మనీ, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, ఫ్రాగ్ దేశాల్లో చిత్రీకరిస్తున్నాం. రవితేజ, రిచాలపై రెండు పాటల్నీ, రవితేజ, దీక్షపై ఓ పాటనీ రాజు సుందరం నృత్య దర్శకత్వంలో తీస్తున్నాం. దీంతో షూటింగ్ మొత్తం అయిపోతుంది. రవితేజ...తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా అందర్నీ వినోదింపజేసే మాస్ రోల్ ని పోషిస్తున్నారు. డిసెంబర్ చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలని సంకల్పించాం అన్నారు.


Click it and Unblock the Notifications











