మాస్ రాజా రవితేజ ‘మిరపకాయ’ క్లైమాక్స్ ఎక్కడంటే....
క్రేజీస్టార్ రవితేజ హీరోగా రిచా గంగోపాధ్యాయ, దీక్ష హీరోయిన్స్ గా ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్‌పై హరీష్ శంకర్ ఎస్. దర్శకత్వంలో అభిరుచి గల నిర్మాత రమేష్ పుప్పాల నిర్మిస్తున్న 'మిరపకాయ్" చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ప్రోగ్రెస్ గురించి నిర్మాత రమేష్ పుప్పాల వివరిస్తూ...పస్ట్ షెడ్యూల్ ఆగ్రా రెండబ షెడ్యూల్ హైదరాబాద్ లలో మిరిపకాయ షూటింగ్ పూర్తి చేసుకొని తర్వాత కన్ క్లూడింగ్ షెడ్యూల్ కొరకు 'బ్యాంకాక్‌లో 12 రోజుల పాటు భారీ ఎత్తున చిత్రీకరించిన క్లైమాక్స్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది.
ప్రస్తుతం ఈ నెల 3 నుండి 3 పాటల్ని యూరప్, జర్మని, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, ఫ్రాగ్ దేశాల్లో చిత్రీకరిస్తాం. రెండు పాటలు రవితేజ, రిచాలపై, ఓ పాట రవితేజ, దీక్షలపై రాజు సుందరం నృత్యదర్శకత్వంలో చిత్రీకరించడంతో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. రవితేజ బాడీ లాంగ్వేజికి తగినట్లుగా అందర్నీ ఎంటర్ టైన్ చేసే మాస్ క్యారెక్టర్ ని అద్భుతంగా పోషిస్తున్నారు. అన్ని వర్గాలవారిని అలరించే విధంగా హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. డిసెంబర్ చివరి వారంలో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం" అన్నారు.


Click it and Unblock the Notifications











