సంక్రాంతికి బాలకృష్ణ, రవితేజల మధ్యే పోటీ...
మొత్తానికి రవితేజ మరోసారి బాలకృష్ణతో వచ్చే సంక్రాంతికి పోటీపడటానికి రెడీ అవుతున్నాడు. రవితేజ తాజా చిత్రం మిరపకాయ..జనవరి 12వ తేదిన విడుదలకు ప్లాన్ చేసారు. అదే రోజున బాలకృష్ణ..చిత్రం పరమ వీర చక్ర విడుదల కానుంది. ఇంతకుముందు 2008 సంక్రాంతికి రవితేజ కృష్ణ చిత్రం తో సక్సెస్ సాధించారు. రవితేజ, రిచా కాంబినేషన్ లో రవితేజ నటించిన మిరపకాయ చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం పాటలు ఇఫ్పటికే రిలీజై మార్కెట్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. మరో ప్రక్క సింహా విజయంతో మంచి ఊపుమీదున్న బాలకృష్ణతో దాసరి తన 150 చిత్రాన్ని ప్లాన్ చేయటం, అంతేగాక అలనాటి సూపర్ హిట్ బొబ్బిలిపులి తరహాలో చిత్రం ఉంటుందని చెప్పటం పరమవీర చక్ర చిత్రానికి ప్లస్ లు కానున్నాయి. ఇక సంక్రాంతికి ఈ రెండు చిత్రాల మధ్యనే ముఖ్యంగా పోటీ ఉంటుందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











