'నేనింతే' పై బ్యాడ్ టాక్

ఇక అని మహీళా కాంగ్రేస్ అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ గంగాభవానీ ..ఏం ఆశ్లీలత ఉంటే తప్ప సినిమాలు ఆడవా..మహిళా సంఘాలు ఎన్నిసార్లు ఆందోళనలు చేస్తున్నా సినిమావాళ్ళు పట్టించుకోవటం లేదు.నేనింతే వాల్ పోస్టర్స్ ను తక్షణం తొలిగించకపోతే మహిళలు ఆగ్రహం చవిచూడవలసి వస్తుంది అని హెచ్చరించారు.
మన సినిమాలకు ఏమిటీ దౌర్భాగ్యం అంటూ ప్రశ్నించారు. ఇక టీడీపి అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మన సినిమాలు ఎటు పోతున్నాయి..అమ్మాయిల బికినీలు,అంగాంగ ప్రదర్శనలు పోస్టర్స్ లేకపోతే సినిమాలు ఆడవన్న వైఖరి దురదృష్టకరం. అంటూ నేనింతే సినిమాను విమర్శించారు.
రిలీజుకు ముందే నేనింతే సినిమా రకరకాల కాంట్రావర్శీలకు తావిస్తోంది. ఓ ప్రక్క మీడియాపై విమర్శనాస్త్రాలు ఉన్నాయని మీడియాకి సంభందించిన వ్యక్తులు మండిపడుతూంటే..మరో ప్రక్క మహిళా సంఘాలు పోస్టర్స్ పూర్తి స్ధాయి అసభ్యతతో నిండి ఉన్నాయని విమర్శిస్తున్నారు. అశ్లీలత పొంగిపొర్లుతున్న ఆ వాల్ పోస్టర్లను తొలిగించాలని,సెన్సార్ బోర్డు కళ్ళు మూసుకుందా అంటూ కన్నెర్ర చేస్తున్నాయి. తక్షణం చర్య తీసుకోకపోత తడాఖా చూపిస్తామంటూ పిడికిలి బిగిస్తూ ముందుకు వస్తున్నారు.


Click it and Unblock the Notifications











