రవితేజ ది మొదలైంది

నిర్మాత గణేష్‌బాబు మాట్లాడుతూ 'రవితేజ కెరీర్‌లో ఇది ఓ సెన్సేషనల్ ఫిలిమ్ అవుతుంది. రవితేజ, నయనతార కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంలో భారీ తారగణం ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఏప్రిల్ 20 నుండి మే 9 వరకు హైదరాబాద్‌లో షెడ్యూల్ చేస్తాం మే 12 నుండి 25 వరకు విదేశాల్లో సాంగ్స్ చిత్రీకరించడానికి ప్లాన్ చేసాం. జూన్‌లో చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేసి ఆగస్ట్‌లో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
ప్రకాష్‌రాజ్, షాయాజీ షిండే, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, నాజర్, జయప్రకాశ్‌రెడ్డి, ఆహుతి ప్రసాద్, ఎం.ఎస్.నారాయణ, సన, వినయప్రసాద్, మాస్టర్ భరత్, జీవా, 'సత్యం" రాజేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: కె.రవీంద్రబాబు, సంగీతం: ఎస్.థామస్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, ఆర్ట్స్: చిన్నా, సమర్పణ: రవికిరణ్‌బాబు, నిర్మాత: గణేష్‌బాబు, కథ,స్క్రీన్‌ప్లే,మాటలు, దర్శకత్వం: పరశురామ్.


Click it and Unblock the Notifications