రవితేజ ‘దరువు’వేస్తే...
మాస్ మహారాజ్ రవితేజ త్వరలో ప్రేక్షకులకు 'దరువు' వేయడానికి రాబోతున్నాడు. రవితేజ-దర్శకుడు శివ(శౌర్యం ఫేం) కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతోందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. తాజాగా అందిన సమాచారం మేరకు ఈ చిత్రానికి 'దరువు' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ మాస్ చిత్రంలో తాప్సీ కథానాయిక. ప్రస్తుతం నిరవధికంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది. రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమాను శివ ఇటీవలే తమిళంలో రీమేక్ చేశాడు.
రవితేజ తాజా చిత్రం 'నిప్పు' సక్రాంతి తర్వాత విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ అనుకోని కారణాల వల్ల ఫిబ్రవరి 2కు వాయిదా వేశారు. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న నిప్పు చిత్రంలో దీక్షాసేథ్ కథానాయిక కాగా, వైవిఎస్ చౌదరి నిర్మాత.


Click it and Unblock the Notifications











