ఎవరైనా రవితేజ ముందు 'బలాదూర్'

సురేష్ ప్రొడక్షన్స్ బానర్‌పై డి. సురేష్‌బాబు నిర్మిస్తున్న సినిమాకు ఈ టైటిల్ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 'కలిసుందాం రా' ఫేమ్ ఉదయశంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్. 'విక్రమార్కుడు' తర్వాత రవితేజ, అనుష్క జంటగా నటిస్తున్న సినిమా కావటంతో ట్రేడ్ లో ఇంట్రస్టుగా ఉంది. అంతేగాక సీనియర్ నటుడు కృష్ణ ఒక కీలక పాత్రలో మరో విశేషం. ఈ సినిమాకు కె.ఎం రాధాకృష్ణన్ సంగీతం సమకూరుస్తుండగా, మణిశర్మ రీ రికార్డింగ్ అందించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.


Click it and Unblock the Notifications











