Don't Miss!
- News టిప్పర్ నడుపుకుంటూ వెళ్లి మరీ నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రవితేజ ఏ విషయంలో వీరుడో చూడాలంటున్న నిర్మాత
రవితేజ తాజా చిత్రం 'వీర' షూటింగ్ నిన్న(నవంబర్ 24) మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో మొదలైంది. కాజల్, తాప్సీ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా చెప్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాన్వి ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మీడియాతో మాట్లాడుతూ..బుధవారం నుంచి షూటింగ్ మొదలెట్టాం. రవితేజ సినిమా అనగానే ప్రేక్షకులు వినోదం ఆశిస్తారు. వాటితో పాటు యాక్షన్, భావోద్వేగాలు, రొమాన్స్ కలిసిన చిత్రమిది. రవితేజ పాత్రని తీర్చిదిద్దిన విధానం ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. నాయికల పాత్రలు రెండూ ప్రాధాన్యత ఉన్నవే. కిక్ శ్యామ్, శ్రీదేవి మరో జంటగా నటిస్తున్నారు. రవితేజ ఏ విషయంలో వీరుడో తెర మీదే చూడాలని అన్నారు. భారీ తారాగణంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న 'వీర' ఏకధాటిగా మార్చి వరకు జరిగే షెడ్యూల్‌తో పూర్తవుతుంది.ఏప్రిల్‌లో వేసవి కానుకగా విడుదల చేస్తాం అన్నారు. ప్రకాష్ రాజ్, రోజా, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, ప్రదీప్‌రావత్, రాహుల్‌దేవ్, సుప్రీత్, వేణుమాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: తమన్.ఎస్, కూర్పు: గౌతంరాజు.