రవితేజకు మరీ ఇంత ‘బలుపు’!
గతంలో 'ఇడియట్' లాంటి విచిత్రమైన టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజ రవితేజ....త్వరలో 'బలుపు' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గోపీచంద్ మలినేని ఈచిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో 'డాన్ శ్రీను' చిత్రం రూపొందిన విషయం తెలిసిందే.
ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ 'బలుపు' అనే టైటిల్ దాదాపుగా ఖరారైనట్లే అని వెల్లడించారు. ప్రసాద్ వి పొట్లూరి పివిపి సినిమా బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
ప్రస్తుతం రవితేజ నటించిన 'దరువు' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. శౌర్యం పేం శివ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రంలో తాప్సీ హీరోయిన్‌గా నటించింది. దరవు చిత్రం రవితేజకు ఉన్న మాస్ ఫాలోయింగ్‌ను సంతృప్తి పరుస్తుందని అంటున్నారు. శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 18న విడుదల చేయటానికి తేదీని ఖరారు చేసినట్లు నిర్మాత చెప్తున్నారు.
తాజాగా రవితేజ పరుశురామ్ దర్శకత్వంలో 'సార్ వస్తారా' అనే టైటిల్ తో రూపొందబోయే చిత్రంపై దృష్టి పెట్టాడు. త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో, నిన్న మొన్నటి వరకూ నయనతార కథానాయిక అనే ప్రచారం జరిగింది. కానీ హీరోయిన్ ఎంపిక ఇంకా ఫైనలైజ్ కాలేదు.


Click it and Unblock the Notifications











