త్వరలో అందరికీ కిక్ ఇస్తా?
రోజులన్నీ ఒకేలా వుండవు పైగా అవన్నీ మనవే అని అనుకోడానికి కూడా వీలులేదు. ఒక్కోక్కరికి ఒక్కో టైం వస్తుంటుంది. అలాగే హీరో 'రవితేజ" కూడా తన టైమ్ గురించి చెప్పుకోస్తున్నాడు. ఏదో సుడిబాగుండి నాకు రోజులు కలిసొచ్చి హీరోనయ్యాను. నాకు తెలిసిన నటనను కాస్త ఎనర్జిటిక్ గా చూపించడంతో స్టార్ ని కూడా అయ్యాను. నా చిత్రాలు అతిగా ఉంటాయని టాక్ ఉన్నప్పటీకీ నా లెవెల్లో నేను నటిస్తాను అని అంటున్నాడు రవితేజ.
అలాగే నా సినిమా విజయం వెనుక ఎంత బాధ్యత వహిస్తానో, ఫ్లాప్ లో కూడా అంతే బాధ్యత వహిస్తాను అంటున్నాడు. 'కిక్" సినిమా విజయం తరువాత వచ్చిన 'ఆంజనేయులు" కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశించిన రవివేజకు నిరాశే మిగిలిందట. అప్పటి నుండి నీ నటనలో మొనాటనీ బ్రేక్ చేసి ఇంకా కొత్త ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడట. డైలాగ్ లోనూ, డ్రెస్సింగ్ లోనూ రకరకాల మార్పులకు ప్రయత్నిస్తున్నాడట. వచ్చే సినిమాల్లో సరికొత్త రవితేజను చూస్తారు మీరు అంటూ ఆశతో చెబుతున్నాడు రవితేజ. కొత్తగా కనబడతానని చాలా మంది చెప్పి కనీసం ముఖం కూడా కనిపించకుండా ఎంతో మంది తిరుగుతున్నారు. నీవు కూడా అలానే చేసి అందరికి 'కిక్" ఇస్తావా ఏమిటి? అంటూ ప్రశ్నిస్తున్నారు అభిమానులు.


Click it and Unblock the Notifications











