twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జనవరి 13న సెంటిమెంట్ గా వస్తున్న రవితేజ నిప్పు...!?

    By Sindhu
    |

    మాస్‌ మహారాజా రవితేజ హీరోగా డైనమిక్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ దర్శకత్వంలో డేరింగ్‌ ప్రొడ్యూసర్‌ వైవియస్‌ చౌదరి బొమ్మరిల్లువారి పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం 'నిప్పు' సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్దమవుతోంది. సంక్రాంతికి రిలీజైన రవితేజ చిత్రాలు 'కృష్ణ', 'మిరపకాయ్‌' సూపర్‌హిట్‌ అయిన నేపధ్యంలో ఈ సంక్రాంతి స్పెషల్‌ 'నిప్పు'పై చాలా మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి.

    ఈ చిత్రం గురించి నిర్మాత వైవియస్‌ చౌదరి మాట్లాడూతూ విడుదలకు ''శరవేగంగా రూపొందుతున్న 'నిప్పు' చిత్రం రవితేజ మార్క్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ కు గుణశేఖర్‌ గారి టేకింగ్‌ స్టైల్‌ తోడై సూపర్‌గా వస్తోంది. ఈ 'నిప్పు'చిత్రంలో నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్‌ ఓ కీలకమైన పాత్రను పోషించడం విశేషం. కమెడియన్స్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ లు ఎంటర్‌ టైన్‌ మెంట్‌ అందించే ట్రెండ్‌ని బ్రేక్‌ చేసి కామెడికే హీరోయిజాన్ని తెచ్చి వరుసగా ఎన్నో సూపర్‌ డూపర్‌హిట్స్‌ ఇచ్చిన ఎంటర్‌ టైన్‌ మెంట్‌ హీరో రాజేంద్రప్రసాద్‌ ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగువాళ్ళు ఆయన చిత్రాల డివిడిలను ప్రత్యేకంగా దాచుకుంటారు. అంతటి పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్న రాజేంద్రప్రసాద్‌ హుందాగా, తన ఇమేజ్‌కి భంగం కలగకుండా తాను మాత్రమే చెయ్యగలరనిపించే వైవిధ్యమైన పాత్రల్ని చెయ్యాలన్న నిర్ణయం తీసుకోవడం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొత్త పరిణామం.

    ముందే మేము చెప్పిన విధంగా డిసెంబర్ లో ఆడియోను...సంక్రాంతి కానుకగా జనవరి 13న 'నిప్పు' విడుదల చేస్తున్నామన్నారు. హీరో రవితేజ పాత్ర ఇందులో నిప్పులా వుంటుంది. అందుకే ఈ చిత్రానికి మేము 'నిప్పు' అనే పేరుని పెట్టడం జరిగింది. సేమ్‌ టైమ్‌ రవితేజ స్టైల్‌ ఆఫ్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌, గుణశేఖర్‌గారి చిత్రాల్లో వుండే కథాబలం, టెక్నికల్‌ వేల్యూస్‌ అన్నీ కలిసి వుంటాయి'' అన్నారు.

    మాస్‌ మహారాజా రవితేజ సరసన పొడుగుకాళ్ళ సుందరి దీక్షాసేథ్‌ కథానాయిగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, ప్రదీప్‌ రావత్‌, బ్రహ్మానందం, కృష్ణుడు, ధóర్మవరపు సుబ్రహ్మణ్యం, ముకుల్‌ దేవ్‌, బ్రహ్మాజీ, సుప్రీత్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్‌, సినిమాటోగ్రఫీ: సర్వేష్‌ మురారి, ఆర్ట్‌: ఆనంద్‌సాయి, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఫైట్స్‌: కనల్‌కణ్ణన్‌, డాన్స్‌: రాజు సుందరం, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.ఆర్‌.కిషోర్‌, కో-ప్రొడ్యూసర్స్‌: యలమంచిలి యుక్త, యలమంచిలి ఏక్తా, సమర్పణ: యలమంచిలి గీత, నిర్మాత: వై.వి.యస్‌.చౌదరి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: గుణశేఖర్‌.

    English summary
    Mass Maharaja Ravi Teja is acting in the movie Nippu under the banner Bommarillu produced by director YVS Chowdary and Gunasekhar is directing the film and it is progressing at Rapid speed in and around Hyderabad. Now the latest news is that producer of this movie YVS Chowdary confirmed the release date on January 13, 2012.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X