ఆఖరి షెడ్యూల్ ల్లో రవితేజ నిప్పు....పస్ట్ లుక్ కేక..!
మాస్ మహారాజా రవితేజ హీరోగా డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో డేరింగ్ ప్రొడ్యూసర్ వైవియస్ చౌదరి బొమ్మరిల్లు వారి పతాకం పై నిర్మిస్తున్న భారీ చిత్రం 'నిప్పు" సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకు సిద్దమౌతోంది. కాగా రవితేజ గెటప్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ చిత్రం లో రవితేజ క్యారెక్టరైజేషన్ లో ఉండే ఎంటర్ టైన్మెంట్ తో పాటు బ్రహ్మానందం కామెడీ ఈ సినిమాకి హైలైట్ అవుతుందంటున్నారు. అలాగే నటుడిగా రాజేంద్ర ప్రసాద్ గారికి వున్న హోదా, ఆయన క్యారెక్టరైజేషన్ లోని హుందాతనం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందంటున్నారు ఈ చిత్ర నిర్మాత వైవియస్ చౌదరి.
ఈ సందర్భంగా నిర్మాత వైవియస్ చౌదరి మాట్లాడుతూ 'ఈ చిత్రం ఈనెల 14 నుంచి డిసెంబర్ 20 వరకు ఏకధాటిగా షెడ్యూల్ జరుగుతుంది. దీంతో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ఓ పక్క శరవేగంగా డబ్బింగ్ కొనసాగుతోంది. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్ కి పంపడం జరిగిందన్నారు. గుణశేఖర్ చిత్రాల్లో వుండే కథాబలం, సాంకేతిక విలువలు ఈ చిత్రాన్ని పెద్ద రేంజ్ కి తీసుకెళ్తాయి.
మాస్ మహారాజా రవితేజ సరసన దీక్షాసేథ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ముకుల్ దేవ్, తదితరు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ది మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











