రవితేజ, గుణశేఖర్ ల 'నిప్పు' చిత్రం లేటెస్ట్ ఇన్ఫో
రవితేజ, గుణశేఖర్ కాంబినేషన్ లో నిప్పు(ద ఫైర్) చిత్రం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఉగాది రోజు ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ముహూర్తం షాట్ ని ఏప్రియల్ నాలగవ తేజీన పిక్చరైజ్ చేయనున్నారు. ఇక మొదటి ఈ చిత్రానికి కత్తి అనే టైటిల్ ని అనుకుని స్క్రిప్టు రెడీ చేసారు. కానీ కళ్యాణ్ రామ్ ఆ టైటిల్ ని తీసుకుని తన చిత్రానికి వాడుకున్న విషయం తెలిసిందే. ఆ వివాదం తర్వాత గుణశేఖర్ ఇప్పుడు ఈ చిత్రంతో బయిటకు రాబోతున్నారు. అలాగే ఈ చిత్రాన్ని మరో దర్శకుడు వైవియస్ చౌదరి నిర్మించనున్నారు.యవన్ శంకర్ రాజా ని సంగీత దర్శకుడుగా ఎంపిక చేసుకున్నారు. హీరోయిన్ ని ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ప్రస్తుతం రవితేజ..రమేష్ వర్మ దర్శకత్వంలో వీర అనే చిత్రం, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో దొంగల ముఠా అనే చిత్రాలు చేస్తున్నారు. అలాగే ఆయన నటించిన మిరపకాయ్ చిత్రం సంక్రాంతి విజేతగా నిలబడింది.


Click it and Unblock the Notifications











