జనవరి ఆరున మాస్ మహారాజా రవితేజ ‘నిప్పు’...!?
మాష్ మహారాజ రవితేజ కొత్త సినిమా 'నిప్పు" శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వైవిఎస్ చౌదరి నిర్మాతగా, బొమ్మరిల్లు బానర్ లో గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. దీనికంటే ముందు రవితేజ 'వీర" సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా కొట్టింది అలాగే గుణ శేఖర్ ఖాతాలో కూడా వరుడు లాంటి ఫ్లాప్ సినిమా ఉంది. దీనితో ఇద్దరు కలిసి మంచి సూపర్ హిట్ సినిమా చేద్దాం అనే తపనతో నిప్పు మొదలు పెట్టారు. అంతే కాదు రవితేజ సరసన మిరపకాయ్ ఫేం దీక్ష సేథ్ నటిస్తోంది. దీక్ష కి కూడా ఇప్పటివరకు మంచి హిట్ లేదు. ఈ సినిమా హిట్ అవడంఅందరికి చాలా అవసరం. మిరపకాయ్ చిత్రం తర్వాత రవితేజ సరసన రెండో సారి దీక్షా సేథ్ జతకడుతోంది.
సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీలో రూపుదిద్దికుంటున్న ఈ చిత్రం హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ఈ సినిమా పొల్లాచ్చి లో షూటింగ్ జరుపుకుంటోంది. పాటల చిత్రీకరణ తో పాటు కొన్ని టాకీ సన్నివేశాలని కూడా చిత్రిస్తున్నారు. ఈ చిత్రం ఓ మాస్ ఎటంర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా బాణీ లు సమకూరుస్తున్నాడు. గుణ శేఖర్, రవితేజ మొట్ట మొదటి సారి గా కలిసి చేస్తున్న చిత్రాన్ని జనవరి 6 2012న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.


Click it and Unblock the Notifications











