రవితేజ 'నిప్పు’కి సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా...లేదా....?
సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలవుతున్న 'నిప్పు" మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు రవితేజ, గుణవేఖర్, వైవియస్ చౌదరి. ఎందుకంటే ఈ ముగ్గురికీ సంక్రాంతి హిట్స్ ఉన్నాయి. 'కృష్ణ", 'మిరపకాయ్" సంక్రాంతికి రిలీజ్ అయి రవితేజ ఖాతాలో సంక్రాంతి హిట్స్ గా నిలిచాయి. మహేష్ తో గుణశేఖర్ చేసిన 'ఒక్కడు కూడా సంక్రాంతికే రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ మిట్ సాధించింద. రామ్ ఇలియానాలతో వైవియస్ చౌదరి రూపొందించిన 'దేవదాసు" సంక్రాంతికి రిలీజ్ అయి అనూహ్య విజయాన్ని సాధించింది.
ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేష్ లో వస్తున్న 'నిప్పు" కూడా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకంతో వున్నారు. గుణశేఖర్ ఇప్పటివరకు చెయ్యని ప్యాట్రన్ లో 'నిప్పు" చేస్తున్నాడు. రవితేజకు మాత్రం ఈ తరహా సినిమాలు మహా క్రేజ్. రవితేజ మార్క్ ఎంటర్ టైన్మెంట్, గుణశేకర్ సినిమాల్లో వుండే ఎమోషన్ 'నిప్పు"లో పుష్కలంగా వున్నాయట. రవితేజ సరసన మిరపకాయ్ ఫేం దీక్ష సేథ్ నటిస్తోంది. దీక్ష కి కూడా ఇప్పటివరకు మంచి హిట్ లేదు.
ఈ సినిమా హిట్ అవడంఅందరికి చాలా అవసరం. మిరపకాయ్ చిత్రం తర్వాత రవితేజ సరసన రెండో సారి దీక్షా సేథ్ జతకడుతోంది. కాగా మరో ముఖ్య మైన పాత్రలో నిప్పులో నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాజేంద్రప్రసాద్ పాత్ర కీలకమని నిర్మాత చెబుతున్నాడు. రవితేజ సరసన దీక్షాసేథ్ నటిస్తోంది. థమన్ సంగీతమందిస్తున్నాడు.ఇక వైవియస్ ఫస్ట్ టైమ్ తను డైరెక్షన్ చేయకుండా నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తూ నిర్మిస్తున్న ఈ 'నిప్పు" సంక్రాంతి విజేతగా నిలుస్తుందా లేదో వేచి చూడాల్సిందే...


Click it and Unblock the Notifications











