రవితేజ 'నిప్పు' స్టోరీలైన్ ఏంటి?
జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాడతను. బాధ్యతలనే మాటే తెలియదు. అల్లరి చిల్లరిగా తిరిగేస్తూ ఇదే జీవితం అనుకుంటాడు. అలాంటి వ్యక్తిపై ఓ పెద్ద బాధ్యత పడింది. లక్ష్యం కోసం అనుక్షణం రగిలిపోతాడు. చివరికి ఏవిధంగా తన లక్ష్యాన్ని చేరుకున్నాడనేదే 'నిప్పు'స్టోరీలైన్. ఆదివారం హైదరాబాద్‌లో 'నిప్పు' డిజిటల్ పోస్టర్‌ని పాత్రికేయుడు బి.ఎ.రాజు ఆవిష్కరించారు. సంక్రాంతికి విడుదల అవుతుందనుకున్న నిప్పు చిత్రాన్ని పిబ్రవరి రెండవ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ డిజిటల్ పోస్టర్ పై ... ''ఎప్పుడూ అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. కానీ ఇప్పుడు అతనికీ ఓ బాధ్యత ఉంది'' అని రవితేజ పాత్ర చిత్రణని ఈ కొటేషన్ ద్వారా సూచాయగా చెప్పడానికి ప్రయత్నించారు దర్శక, నిర్మాతలు గుణశేఖర్, వైవీఎస్ చౌదరి.
అలాగే ఈ చిత్రం గురించి నిర్మాత వైవియస్ చౌదరి మాట్లాడుతూ.. ''దర్శకుడు కథ ఎంత చక్కగా చెప్పారో అంతే గొప్పగా తెరపై ఆవిష్కరించారు. రవితేజ గత చిత్రాల కంటే రెండింతలు ఎనర్జీతో ఈ చిత్రంలో నటించారు. దక్షిణాదిలో తొలిసారిగా మా చిత్రానికి డిజిటల్ పోస్టర్‌ని రూపొందించడం ఆనందంగా ఉంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు ఆలస్యం కావడం వలన సంక్రాంతికి విడుదల చేయడం లేదని అన్నారు.
దీక్షాసేథ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, శ్రీరాం, కృష్ణుడు, బ్రహ్మాజీ, సుప్రీత్, ప్రదీప్‌రావత్, ప్రగతి ఇతర పాత్రధారులు. ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి, కళ: ఆనంద్ సాయి, కూర్పు: గౌతమ్‌రాజు, మాటలు: ఆకుల శివ, శ్రీధర్ సీపాన, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యస్.ఆర్.కిషోర్, సహ నిర్మాతలు: యలమంచిలి యుక్త, యలమంచిలి ఏక్త, సంగీతం: తమన్.


Click it and Unblock the Notifications











