నాగ్ 20 లక్షలు, నితిన్ 10 లక్షలు, రవితేజ 10 లక్షలు!
హైదరాబాద్: హుధూద్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్ట పోయిన విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని బాధితులకు సహాయం చేయడానికి పలువురు సినీ తారలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరో నితిన్ రూ. 10 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం విరాళం ప్రకటించారు. అక్కినేని నాగార్జున కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న అక్కినేని ఫౌండేషన్ రూ. 20 లక్షల విరాళం ప్రకటించారు. అదే విధంగా హీరో రవితేజ రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు.
హుధూద్ తుఫాన్ బాధుతుల కోసం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా స్టార్ హీరోలంతా తమవంతు సహాయం చేయడానికి ముందు వచ్చిన సంగతి తెలిసిందే. కామెడీ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా నేను సైతం అంటూ ముందుకు వచ్చాడు. తన వంతు సహాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. లక్షల సహాయం ప్రకటించారు.

ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం టాలీవుడ్ హీరోలైన పవన్ కళ్యాణ్ రూ. 50 లక్షల విరాళం, మహేష్ బాబు రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు. మరో వైపు జూ ఎన్టీఆర్ 20 లక్షలు, అల్లు అర్జున్ 20 లక్షలు, ప్రభాస్ 20 లక్షలు, కృష్ణ 15 లక్షలు, విజయనిర్మల 10 లక్షల చొప్పున విరాళం అందించారు. మరో వైపు రామ్ చరణ్ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. 10 లక్షలు, విశాఖలోని రామకృష్ణ మిషన్ కోసం రూ. 5 లక్షలు విరాళం అందించారు.
తెలుగు సినీ నిర్మాతల మండలి కూడా తమవంతుగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు. ఎలాంటి సహాయమైనా చేయడానికి తెలుగు సినీ పరిశ్రమ ముందు ఉంటుందని నిర్మాతలు దిల్ రాజు, బండ్ల గణేష్, సాగర్ తదితరులు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











