'నిప్పు' కాకుండా రవితేజ మరో మాస్ డైరక్టర్ కి గ్రీన్ సిగ్నల్.. వివరాలు
కంటిన్యూగా సినిమాలు ఒప్పుకుంటూ పోతున్న రవితేజ తాజాగా మరో చిత్రం కమిటయ్యారు.గోపీచంద్ తో శౌర్యం, శంఖం చిత్రాలు రూపొందించిన దర్శకుడు శివ తో సినిమా చేయటానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.తనదైన శైలిలో మరింత మాస్ మసాలా సినిమాలు రూపొందించే శివ దర్శకత్వంలో చేయటం కమర్షియల్ గా తనకు మరో బ్రేక్ తెచ్చే చిత్రం కానుందని రవితేజ భావించే ఈ చిత్రం ఓకే చేసినట్లు చెప్తున్నారు.ఇక ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత బూరుగుపల్లి శివరామ కృష్ణ నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ఆగస్టు నుంచి సెట్స్ కి వెళ్ళనుంది.ఇక రీసెంట్ గా శివ తమిళంలో విక్రమార్కుడు చిత్రాన్ని రీమేక్ చేసి హిట్ కొట్టారు.ఇక రవితేజ రీసెంట్ రిలీజ్ వీర భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











