twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పుడు వార్తలు రాశారు: తమ్ముడి పెద్దకర్మ వద్ద మీడియాతో రవితేజ వాదన!

    తమ్ముడి మరణంపై రవితేజ తొలిసారి మీడియా ముందుకొచ్చారు. అంత్యక్రియలకు రాక పోవడంపై వివరణ ఇచ్చారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తన రక్తం పంచుకుపుట్టిన తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణిస్తే కనీసం చివరి చూపు కూడా చూడలేదు, అంత్య క్రియలకు హాజరు కాలేదు. ఆసుపత్రి నుండి నేరుగా స్మశానానికే మృతదేహాన్ని తరలించి అనాద శవంలా దహనం చేవారు. తలకొరివి కూడా ఎవరో క్యారెక్టర్ ఆర్టిస్టుతో పెట్టించారు....అనే. విమర్శలపై రవితేజ స్పందించారు.

    బుధవారం భరత్ పెద్దకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రవితేజను మీడియా వారు ప్రశ్నించారు. మీడియా ప్రశ్నలతో రవితేజ కాస్త ఇబ్బంది పడ్డాడు.

    క్యారెక్టర్ ఆర్టిస్టుతో తలకొవిరి పెట్టించలేదు

    క్యారెక్టర్ ఆర్టిస్టుతో తలకొవిరి పెట్టించలేదు

    ఎవరో బయటి వ్యక్తి, క్యారెక్టర్ ఆర్టిస్టుకు రూ. 1500 ఇచ్చి తలకొరివి పెట్టించామనే వార్తల్లో నిజం లేదని, ఇది పూర్తిగా అవాస్తవమని రవితేజ స్పష్టం చేశారు. తన తమ్ముడు రఘు, బాబాయ్ అంత్యక్రియలు దగ్గరుండి చూసుకున్నారని తెలిపాడు.

    అందుకే రాలేదు

    అందుకే రాలేదు

    తమ్ముడిని ప్రాణం లేకుండా చూడటం ఇష్టం లేకనే తాను, అమ్మ, ఇతర కుటుంబ సభ్యులమెవరూ రాలేదని, తమ మదిలో అతడి ఇమేజ్ ఎప్పుడూ హ్యాపీగా ఉండిపోవాలనే ఇలా చేశామని రవితేజ తెలిపారు.

    షూటింగుకు హాజరైన మాట నిజమే

    షూటింగుకు హాజరైన మాట నిజమే

    భరత్ మరణించిన మర్నాడు షూటింగుకు హాజరు కాలేదు. ఆ తర్వాతి రోజు వెళ్లిన మాట వాస్తవమే. సినిమా అంటే ఓ పాతిక మంది ఆర్టిస్టుల కాంబినేషన్లో షూటింగ్ ఉంటుంది. అది మిస్సయితే మళ్లీ ఎప్పుడో గానీ కుదరదు, షూటింగుకు ఇబ్బంది కలిగించడం ఇష్టం లేకనే వెళ్లానని రవితేజ తెలిపారు.

    లోలోపల బాధ ఉంది.

    లోలోపల బాధ ఉంది.

    షూటింగ్ లొకేషన్లో కాస్త నవ్వుతూ కనిపించినా, ఫోటోలకు ఫోజులు ఇచ్చినా అది కేవలం పైకి కనిపించేది మాత్రమే..... తమ్ముడు మరణించిన బాధ లోన ఉంటుందని రవితేజ తెలిపారు.

    తమ్ముడు వార్తలు రాయొద్దు

    తమ్ముడు వార్తలు రాయొద్దు

    అయితే రవితేజ మీడియా తీరును తప్పుబట్టడంతో కొందరు విలేకరులు తమ ప్రశ్నలదాడితో రవితేజను బెదరగొట్టారు. మా వద్ద ప్రూఫ్స్ ఉన్నాయి, మీరు చేసిన పనిని కప్పిపుచ్చుకోవాలని చూడొద్దు అని గట్టిగా మాట్లాడటంతో.... రాంగ్ న్యూసులు రాసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి అంటూ రవితేజ అక్కడి నుండి వెళ్లిపోయారు.

    English summary
    Tollywood star Ravi Teja has finally broken silence on why he skipped his brother Bharath Raju's funeral, who passed away in a car crash.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X