పరశురాం దర్శకత్వంలో రవితేజ సినిమా..?
నారా రోహిత్ హీరోగా వచ్చిన 'సోలో' సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు పరశురాం తర్వాతి సినిమాకు ప్లాన్ చేసుకుంటున్నాడు. హీరో రవితేజను దృష్టిలో పెట్టుకుని పరశురాం ఇటీవల ఓ కథను తయారు చేసుకున్నాడని, రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా సరిపోయే ఈ కథను ఇటీవల రవితేజకు వినిపించాడని, ఇది విన్న వెంటనే ఎంతో ఎగ్జైట్ అయిన రవితేజ వెంటనే ఓకే చెప్పాడని సినీ వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని వై.జయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో రవితేజ-పరశురాం కాంబినేషన్లో 'ఆంజనేయులు' సినిమా వచ్చింది. అయితే ఆ సినిమా పెద్దగా విజయం సాధించ లేక పోయింది.
రవితేజ ప్రస్తుతం శివ దర్శకత్వంలో 'దరువు' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రవితేజ...పూరి జగన్నాథ్ దర్శకత్వంలో దేవుడు చేసిన మనుషులు చిత్రంలో నటించబోతున్నాడు. ఈ రెండు చిత్రాలపూ పూర్తయిన తర్వాత పరశురాం-రవితేజ కాంబినేషన్ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
రవితేజ హరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వివైఎస్ చౌదరి నిర్మించిన 'నిప్పు' చిత్రం ఇటీవల విడుదలై మిక్స్‌డ్ టాక్‌తో ముందుకు సాగుతోంది. దీక్ష సేథ్ ఈచిత్రంలో హీరోయిన్ గా నటించింది. తమన్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











