రవితేజ సిగ్గులేకుండా ఎలా చేస్తాడో: నవ్విస్తూనే ఎమోషనల్‌గా మాట్లాడిన పవన్ కళ్యాణ్!

By Bojja Kumar

Recommended Video

Pawan Kalyan Speech At Nela Ticket

ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ''సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం'' వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో, 'రాజా ది గ్రేట్‌'తో అదరగొట్టిన మాస్ మహారాజా 'రవితేజ' హీరోగా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న చిత్రం 'నేల టిక్కెట్టు'. ఈ చిత్రం ఆడియో వేడుక గురువారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, రవితేజ మధ్య జరిగిన సంభాషణ నవ్వులు పూయించింది.

పవన్ కళ్యాణ్ నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ అదే: రవితేజ

పవన్ కళ్యాణ్ నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ అదే: రవితేజ

నాకు తెలిసిన వాళ్లలో చాలా స్ట్రైయిట్ ఫార్వర్డ్ గా ఉండే వారిలో జగపతి బాబు, పవన్ కళ్యాణ్ ఒకరు. మామూలుగా మనకు ఎన్నో కాంప్లిమెంట్స్ వస్తుంటాయి. ఎంతో మంది రకరకాలుగా పొగుడుతుంటారు. కొన్ని కాంప్లిమెంట్స్ ఎప్పటికీ మరిచిపోలేం. పదేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గారితో ఫోన్లో మాట్లాడటం జరిగింది. ఆయన అపుడు నాకు ఓ కాంప్లిమెంట్ ఇచ్చారు. మీరు అంత సిగ్గులేకుండా ఎలా చేస్తారు? అని అడిగారు. ఆయన ఆ మాట అనడం ఎప్పటికీ మరిచిపోలేను. ప్రతి విషయంలో ఆయన చాలా ఓపెన్ గా ఉంటారు. అందుకే పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం... అని రవితేజ వ్యాఖ్యానించారు.

రవితేజ ఎన్నో బాధలను తట్టుకుని ఈ స్థాయికొచ్చారు: పవన్ కళ్యాణ్

రవితేజ ఎన్నో బాధలను తట్టుకుని ఈ స్థాయికొచ్చారు: పవన్ కళ్యాణ్

నేను యాక్టర్ అవ్వక ముందు వీధుల్లో తిరుగుతున్నపుడు నటుడిగా రవితేజను చూశాను. ఆయన నవ్వుల వెనక, పెర్ఫార్మెన్స్ వెనక చాలా తపన, చాలా కష్టం, చాలా కృషి, చెప్పలేని కష్టాలతో కూడిన బాధలు. ఒక వ్యక్తి ఇంత హాస్యం పండిస్తున్నాడంటే గుండెల్లో ఎంతో కొంత ఆవేదన, బాధ లేక పోతే హాస్యం అనేది రాదు. అందుకే రవితేజగారు అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. ఆయన నటుడిగా ఎదుగుతున్న స్థాయి నుండి చాలా దగ్గరగా చూశాను. ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా తట్టుకుని నిల్చుని ఈస్థాయిలో ఉండటం ఆనందంగా ఉంది... అని పవన్ కళ్యాణ్ అన్నారు.

రవితేజ సిగ్గులేకుండా ఎలా చేస్తాడో?

రవితేజ సిగ్గులేకుండా ఎలా చేస్తాడో?

రవితేజ చెప్పింది నిజమే... ఈయన ఇంత సింగ్గులేకుండా ఎలా యాక్ట్ చేస్తాడో అనుకుంటూ ఉంటాను. ఇది నేను చాలా ఇష్టంతో చెప్పిన మాట. నాకు అంత సిగ్గు వదిలేసి యాక్ట్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. రవితేజ ఎంత మంది జనం ఉన్నా, ఎలాంటి పాత్ర చేయాలనుకున్నా సిగ్గు అనే పదాన్ని ఇంట్లో పెట్టేసి బయటకు వచ్చి చాలా బలంగా చేయగలరు. అందుకే ఆయనంటే ఇన్స్‌స్పిరేషన్. ఈ సినిమా నేల టికెట్ ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.... అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

రోజు రోజుకు నేను ముదిరిపోతున్నాను: జగపతి బాబు

రోజు రోజుకు నేను ముదిరిపోతున్నాను: జగపతి బాబు

ఇన్నేళ్లుగా అన్ని పాత్రల్లో నన్ను ప్రేక్షకులు భరిస్తున్నారు. ఏ పాత్ర చేసినా ఒప్పుకుంటున్నారు. బ్యాడ్ క్యారెక్టర్ చేస్తే ఇంకా బాగా ఒప్పుకుంటున్నారు. కానీ నా భయం ఒకటే... క్యారెక్టర్లు చేసీ చేసీ రోజు రోజుకు ముదిరిపోతున్నాను. బ్యాడ్ అయిపోకపోతే చాలు. పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ అయ్యేముందు, పొలిటీషన్ అయ్యే ముందు పది పన్నెండేళ్ల క్రితం చిరంజీవిగారికి చెప్పారు. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. కొత్తగా పొగడ్త కోసం ఈ మాట చెప్పడం లేదు. ఇది నిజం. బడ్జెట్ పద్మనాభం అనే సినిమాలో నేను హీరో, రవి క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇపుడు రవి హీరో, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్. రవి ఇంత పెద్ద సెలబ్రిటీ అయినందుకు కంగ్రాట్స్. బడ్జెట్ పద్మనాభంలో ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. అదే క్యారెక్టర్... అదే ఫ్రెండ్లీనెస్. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని జగపతి బాబు వ్యాఖ్యానించారు.

నేల టికెట్

నేల టికెట్

రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం మే 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘ఫిదా' ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం, ఛోటా కే ప్రసాద్ కూర్పు, బ్రహ్మ కడలి కళ, ముఖేష్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X