నాకంటే తన గురించే ఎక్కువగా ఆలోచించా...రవితేజ

By Srikanya

నాకంటే తన గురించే ఎక్కువగా ఆలోచించేవాడ్ని.హరీష్‌శంకర్‌ సత్తా నాకు తెలుసు. 'మిరపకాయ్‌'తో తను దర్శకుడిగా నిరూపించుకోవాలి అనుకొన్నాను. ఈ విజయంతో నా నమ్మకం నిజమైంది అంటున్నారు రవితేజ. ఆయన తన తాజా చిత్రం 'మిరపకాయ్‌' విజయోత్సవ సభ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఆ సభలో ఇలా స్పందించారు. ఇక దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ..'షాక్"లాంటి ఫెయిల్యూర్ సినిమాని తీసిన నాపై ఇంత నమ్మకం ఉంచి ఈ చిత్రాన్ని ఇచ్చి అన్నిటికీ వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహించిన హీరో రవితేజకు పూర్తి క్రెడిట్ దక్కుతుంది. ముఖ్యంగా నా డైరక్షన్ డిపార్ట్‌మెంట్ వారు ప్రతి క్షణం కూడా వృధా చేయకుండా సినిమాను సినిమాను అభిమానించి పనిచేశారు. అందువల్లనే ఈ సినిమా అటు ప్రేక్షకుల పరంగా, ఇటు పరిశ్రమపరంగా విజయవంతమైన చిత్రంగా ముద్ర వేయించుకుంది అన్నారు. దర్శకుడి కృషి, రవితేజ శ్రద్ధ ఈ సినిమాకి విజయాన్ని అందించాయని నిర్మాత రమేష్‌ పుప్పాల చెప్పారు. కార్యక్రమంలో రిచా గంగోపాధ్యాయ, దీక్షాసేథ్‌, అలీ, సునీల్‌, తమన్‌ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X