పూరి-రవితేజ ‘దేవుడు చేసిన మనుషులు’ ప్రారంభం
మాస్ మహారాజ్ రవితేజ, సెన్సేషన్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'దేవుడు చేసిన మనుషులు' అనే సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం శుక్రవారం లాంఛనంగా ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. పూరి ఆఫీసులోనే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్య్రకమం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి కో ప్రొడ్యూసర్ భోగవల్లి బాపినీడు కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశంలో రవితేజ దేవుడిని ప్రార్థిస్తూ నటించారు.
వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. మార్చి నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ
ఈ చిత్రంగా గతంలో రవితేజ మాట్లాడుతూ...జగన్ కాంబినేషన్ లో చేస్తున్న అయిదో సినిమా ఇది. మా ఇద్దరి కలయికలో ఎక్స్ పెక్ట్ చేసే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయన్నారు. ఈ సినిమాలో రవి క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా వుంటుంది. మంచి ఎంటర్ టైన్ మెంట్ తో అందర్ని అలరించే సినిమా అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ వంద శాతం పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ ఇది. ఈ చిత్రం పక్కా ట్రెండ్ సెట్టర్ అవుతుంది. రవితేజ సరసన ఇలియానా నటిస్తుంది. జూన్ లో సినిమా రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ చిత్రానికి కుంచె రఘు సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











