మరో రెండు రోజుల్లో రవితేజ ‘దేవుడు చేసిన మనుషులు’

రవితేజ-పూరి కాంబినేషన్లో గతంలో వచ్చిన ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రాలు భారీ విజయం సాధించాయి. నేనింతే సినిమా మాత్రం నిరాశ పరిచింది.'దేవుడు చేసిన మనుషులు' ఈ ఇద్దరి కాంబినేషన్లో వయస్తున్న 5వ సినిమా. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ఇలియానాను ఎంపిక చేశారు. రఘు కుంచె ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
ఈ సినిమా ప్రారంభం రోజు రవితేజ నటించిన 'నిప్పు' చిత్రం విడుదలవుతుండటం విశేషం. ప్రస్తుతం రవితేజ 'దరువు' చిత్రంలో నటిస్తున్నాడు. శౌర్యం ఫేం శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సౌండ్ ఆఫ్ మాస్ అనే సబ్ టైటిల్ తో ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న చిత్రంలో తాప్సీ కథానాయిక.


Click it and Unblock the Notifications











