పూరి-రవితేజ నవ్వుల బాంబులు!
పూరి జగన్నాథ్, రవితేజ కాంబినేషన్లో అప్పట్లో వచ్చిన 'ఇడియట్' సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇటు రవితేజతో పాటు అటు పూరి జగన్నాథ్ కెరీర్ కి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా అది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది. 'ఇడియట్-2'గా రూపొందుతున్న ఈచిత్రం మార్చి 15 నుంచి బ్యాంకాక్ లో ప్రారంభం కానుంది. ఇలియాన ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో హీరో, హీరోయిన్ ఇద్దరి పాత్రలను ఇడియట్స్ లా డిజైన్ చేశారు.
తాజాగా సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం...ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ తో పాటు కడుపు చెక్కలయ్యే కామెడీని మేళవించి రూపొంస్తున్నారని తెలుస్తోంది. పూరి దర్శకత్వం వహించిన గత సినిమాల కంటే ఈ సినిమా పూర్తి కొత్తగా ఉంటుందని అంటున్నారు. రవితేజ మాస్ ఇమేజ్‌కు తోడు పూరి డైరెక్షన్ అభిమానులకు అద్భుతంగా నచ్చే విధంగా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా ద్వారా థియేటర్లో నవ్వుల బాంబులు పేలడం ఖాయంగా కనిపిస్తోంది.
పూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు పూరి జన్నాథ్ పవన్ కళ్యాణ్, జూ ఎన్టీఆర్, నాగచైతన్యతో సినిమాలు చేయనున్నారు. అదే విధంగా రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా హిందీలో బిజినెస్ మేన్ రీమేక్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారు.


Click it and Unblock the Notifications











