పూరీ-రవితేజ ‘దేవుడు చేసిన మనుషులు’ ఫిబ్రవరి 17న
మాస్ మహారాజ్ రవితేజ-సెన్సేషన్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో 'దేవుడు చేసిన మనుషులు' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయాలను పూరి అధికారికంగా ప్రకటించారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 17న ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేశారు. మార్చి నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 'దేవుడు చేసిన మనుషులుష' రవితేజ-పూరీ కాంబినేషన్లో వయస్తున్న 5వ సినిమా.
బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ఇలియానాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రఘు కుంచె ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం దక్కించుకున్నాడు. జూన్ నెలలో ఈ సినిమా థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ చిత్రంత తర్వాత పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ తో ఓ సనిమా, జూ ఎన్టీఆర్, నాగచైతన్యలతో కూడా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. రవితేజ తాజా సినిమా 'నిప్పు' ఫిబ్రవరి 17న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే రోజు 'దేవుడు చేసిన మనుషులు' సినిమా ప్రారంభం కావడం విశేషం.


Click it and Unblock the Notifications











