రవితేజ"ఇడియట్ 2" అఫీషయల్ ప్రకటన
రవితేజ,పూరీ జగన్నాధ్ కాంబినేషన్ వచ్చి సూపర్ హిట్టయిన చిత్రం ఇడియట్. ఈ చిత్రం సీక్వెల్ ఇడియట్ -2 చిత్రం కి సంభందించిన ప్రకటనను దర్శకుడు పూరీ జగన్నాధ్ మీడియాకు విడుదల చేసారు.ఈ విషయమై ఆయన మాట్లాడుతూ...అప్పట్లో ఇడియట్ లో హీరో క్యారెక్టరైజేషన్ ని చాలా డిఫెరెంట్ గా ఫీలయ్యారు. ఇడియట్ 2 కూడా డెఫినెట్ గా ఓ ట్రెండ్ సెట్టర్ అయ్యేలా స్క్రిప్టు రెడీ చేస్తున్నాను.త్వరలోనే ఈ చిత్రానికి సంభందించిన వివరాలు తెలియచేస్తాను. రవితేజ కాంబినేషన్ లో నేను చేస్తున్న మరో పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ ఇడియట్ 2 అన్నారు. ఈ చిత్రానికి కథ,మాటలు, నిర్మాత,దర్శకత్వం...పూరీ జగన్నాధ్.


Click it and Unblock the Notifications











