రవితేజ ‘కిక్-2’ టీజర్ (వీడియో)
హైదరాబాద్: రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కిక్-2'. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. ఈ రోజు(సోమవారం) రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫస్ట్‌లుక్, టీజర్‌ను విడుదల చేశారు. ఆ టీజర్ ని మీరూ ఓ లుక్కేయండి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ‘కిక్'కు సీక్వెల్ కాదు. కానీ అందరికీ డబుల్ కిక్ ఇస్తుంది. ‘కిక్'లో రవితేజ, ఇలియానా జంటగా నటించారు. వాళ్లిద్దరి కొడుకు కథే ‘కిక్-2'. ఇటీవలే రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో క్లైమాక్స్‌ను భారీగా తెరకెక్కించాం. త్వరలో హైదరాబాద్‌లో తదుపరి షెడ్యూల్ ఉంటుంది'' అని తెలిపారు.

నందమూరి కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ ‘‘అతనొక్కడే వంటి హిట్ తర్వాత సురేందర్‌రెడ్డి మా సంస్థలో చేస్తున్నారు. రవితేజ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. హై టెక్నికల్ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందిస్తున్నాం. వేసవికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.
ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమని రవితేజ అన్నారు. 'కిక్'లో జంటగా నటించిన రవితేజ, ఇలియానా పాత్రల కొడుకు కథే ఈ 'కిక్ 2' అని దర్శకుడు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ...యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవితేజ మార్క్ ఎంటర్‌టైనర్‌తోపాటు సురేందర్ రెడ్డి, తమన్నా మ్యాజిక్ మళ్లీ రిపీట్ కానుంది. ఈ చిత్రం మే 28, 2015న విడుదల చేస్తామన్నారు.
ఈ చిత్రంలో రవితేజ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, సంగీతం: యస్.యస్.థమన్, కెమెరా: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నారాయణరెడ్డి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్.
రవితేజ పుట్టిన రోజు సందర్బంగా...
చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ కష్టపడి పైకొచ్చిన అతి కొద్ది మందిలో ఒకరు రవితేజ. హీరోగా తానేంటో ఎప్పుడో నిరుపించుకున్నారు. వయసు 46 ఏళ్లు దాటినా అది కనిపించకుండా కుర్ర హీరోలతో పోటీపడగల సత్తా అతడిది. రవితేజ సినిమా అంటే మినిమం గ్యారంటీ, అతని సినిమా అంటేనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందుకే అతడితో సినిమాలు తీయడానికి నిర్మాతలు, దర్శకులు ఇష్టపడతారు.
1968 జనవరి 26న జన్మించిన రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట ఆయన జన్మస్థలం. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన రవితేజకు కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘సింధూరం' చిత్రంలో ముఖ్య పాత్ర పోషించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా నీ కోసం సినిమాతో రవితేజ హీరోగా పరిచయమయ్యాడు.
ఆ చిత్రంలో ఆయన నటనకు పలువురి ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది. తరువాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అవును వాళ్లు ఇద్దరూ ఇష్ట పడ్డారు, ఇడియట్, ఖడ్గం, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, భద్ర, విక్రమాక్కుడు, దుబాయ్ శ్రీను, కృష్ణ, కిక్, మిరపకాయ్, బలుపు, పవర్ చిత్రాలతో రవితేజ తన పరంపరను కొనసాగిస్తున్నారు.


Click it and Unblock the Notifications











