Ramarao On Duty Twitter Review: రవితేజ మూవీ పరిస్థితి ఇదా.. కొత్త సమస్య.. ఓవరాల్ రిపోర్ట్ ఏంటంటే!
ఎన్నో ఏళ్ల పాటు సినిమా ఆఫీస్‌ల చుట్టూ తిరిగి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలను అందుకుని.. ఆ తర్వాత చాలా కష్టాలను అనుభవించిన తర్వాత సోలో హీరోగా మారిపోయాడు రవితేజ. కెరీర్ ఆరంభంలోనే తనదైన శైలి యాక్టింగ్‌తో బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌ను ఆకట్టుకుని మాస్ మహారాజ్ అనే బిరుదును దక్కించుకున్నాడు. అలా చాలా కాలంగా హిట్టు మీద హిట్లు కొడుతూ స్టార్‌గా మారిపోయాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమా చేశాడు. ఎన్నో అంచనాలతో రూపొందిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో దీనిపై ట్విట్టర్ వేదికగా ఎలాంటి స్పందన దక్కుతుందో చూద్దాం పదండి!

రామారావుగా ఎంటరైన రవితేజ
టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ నటించిన తాజా చిత్రమే 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మందవ తెరకెక్కించిన ఈ మూవీలో ఇందులో దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించాడు. ఇందులో వేణు తొట్టెంపూడి కీలకమైన పాత్రను పోషించాడు.

అలాంటి కథ.. అంచనాలతోనే
తెలుగు రాష్ట్రానికి చెందిన డిప్యూటీ కలెక్టర్ రామారావు.. ఓ మిస్టరీని ఛేదించడం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఈ క్రమంలోనే ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై ఎలా పోరాటం చేశాడు? అనే నేపథ్యంతో 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ తెరకెక్కింది. దీనికితోడు రవితేజ నటించిన ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలతో అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయని చెప్పొచ్చు.

బిజినెస్ తగ్గట్లుగానే విడుదల
రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 7 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 15 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి రూ. 17.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

రవితేజ మూవీకి టాక్ ఏంటి?
రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్ సహా ఇండియాలోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు ఊహించని విధంగా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఈ మూవీ బాగుందని కొందరు, పర్వాలేదని ఇంకొందరు ట్వీట్లు చేస్తున్నారు.

ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ ఇలా
'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికి డైరెక్టర్ శరత్ మందవ చాలా సమయం తీసుకున్నాడట. పాత్రలను పరిచయం చేయడం.. సాంగ్స్‌కు ఎక్కువ సమయం తీసుకున్నాడట. అయితే, సెకెండాఫ్ మాత్రం మిస్టరీ కేసును చేదించే సీన్లతో పాటు రవితేజ మార్క్ మాస్ సీక్వెన్స్‌లు అదిరిపోయేలా వచ్చాయని టాక్.

సినిమా ప్లస్... మైనస్‌లు ఇవే
'రామారావు ఆన్ డ్యూటీ' మూవీని చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. ఇందులో రవితేజ వన్ మ్యాన్ షో చేశాడట. అలాగే, బ్యాగ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్, డైలాగ్స్, క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్లుగా ఉన్నాయని అంటున్నారు. అయితే, కామెడీ లేకపోవడం, థ్రిల్ మిస్ అవడం, లాజిక్ లేని సీన్లు, పాటల టైమింగ్ మిస్ అవడం ఈ సినిమాకు మైనస్‌గా మారాయని చెప్తున్నారు.

మొత్తంగా మూవీ ఎలా ఉంది
తాజా సమాచారం ప్రకారం.. రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ ఇన్వెస్టిగేటివ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. ఇందులో రవితేజ మార్కు మాస్ యాక్షన్‌తో సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయట. అయితే, ఏమాత్రం అంచనాలు లేకుండా వెళ్లే వాళ్లకు మాత్రమే ఈ సినిమా నచ్చుతుందని తెలుస్తోంది. రవితేజ ఫ్యాన్స్‌కు మాత్రం బాగా నచ్చతుందట.

కొత్త సమస్య గురించి చెప్తూ
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇందులో డబ్బింగ్ సరిగా లేదని కొందరు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. అంటే హీరో డైలాగ్ చెప్పేటప్పుడు లిప్ సింక్ అవడం లేదట. ఇది ఈ సినిమాలో గమనించిన వారికి ఇబ్బంది కలిగించేలా ఉందని అంటున్నారు. ఈ సమస్యను చిత్ర యూనిట్ ఏం చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











