రవితేజ..నిజ జీవిత పాత్రను చేస్తున్న చిత్రం అది
రవితేజ స్వతహాగా అమితాబ్ అభిమాని. హీరో అవ్వాలన్న ఆశ ఆయనలో మొగ్గ తొడిగింది అమితాబ్ సినిమాలు చూసే. ఇప్పుడాయన దాదాపు తన నిజజీవిత పాత్రనే 'డాన్‌శీను' సినిమాలో చేశారు. కాకపోతే..రవితేజ నిజజీవితంలో అమితాబ్‌లా హీరో అవ్వాలనుకున్నారు. ఈ సినిమాలో మాత్రం అమితాబ్ 'డాన్' సినిమా చూసి తాను కూడా ఓ డాన్‌గా మారాలనుకుంటాడు అంటున్నారు నూతన దర్శకుడు గోపీచంద్ మలినేని.ఆయన ఈ చిత్రం ప్రధాన పాయింట్ చెబుతూ...పేరు శీను. అతని లక్ష్యం ఒకటే - డాన్ గా ఎదగడం! ఎవరైనా డాక్టరో, ఇంజినీరో అవ్వాలనుకొంటారు. మరి శీనేంటీ డాన్ అవ్వాలనుకోవడం అంటారా..? దానికో స్ఫూర్తి ఉందండోయ్. అమితాబ్ బచ్చన్ 'డాన్' సినిమాయే అందుకు కారణం. మరి శీను డాన్ ఎలాగయ్యాడో తెర మీదే చూడమంటున్నారు ఈ సినిమా ఎలా ఉంటుందో ఓ అంచనాకు రావడానికి ఈ ఒక్క పాయింట్ చాలు అని చెప్తున్నారు.
రవితేజ సరసన శ్రియ హీరోయిన్ గా చేసిన ఈ 'డాన్ శీను' చిత్రం బుధవారంతో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. చిత్ర సమర్పకుడు అచ్చిరెడ్డి మాట్లాడుతూ -"షూటింగ్ పూర్తయింది. ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. దర్శకుడు గోపిచంద్ మలినేని ఏ విషయంలోనూ కంగారు పడకుండా, తపనతో ఈ సినిమా చేశాడు. నిర్మాణానంతర పనులు ముగించుకొని ఆగస్ట్ ప్రథమార్థంలో సినిమాను విడుదల చేస్తాం' అని తెలిపారు. శ్రీహరి మరో కీలక పాత్ర చేసిన ఈ సినిమాలో డా.బ్రహ్మానందం, సయాజీ షిండే, వేణుమాధవ్, బ్రహ్మాజీ, యాష్ పాల్ శర్మ తదితరులు కూడా ఇతర పాత్రలు చేశారు.
ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్, ఎడిటింగ్: గౌతంరాజు, కో-డైరెక్టర్: తరణీరావు, కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: మణిశర్మ, కథ, స్కీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని, నిర్మాత: వెంకట్, నిర్మాణం: ఆర్.ఆర్.మూవీమేకర్స్.


Click it and Unblock the Notifications











