twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేనంతే.. భరతే కాదు.. శ్రీహరి అంత్యక్రియలకూ వెళ్లలేదు.. తల్లి కుప్పకూలింది.. రవితేజ

    తన సోదరుడు భరత్ అంత్యక్రియలకు హీరో రవితేజ హాజరుకాకపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత తమ్ముడిని చివరి చూపు చూడకపోవడంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మీడియాలోనూ, సో

    By Rajababu
    |

    తన సోదరుడు భరత్ అంత్యక్రియలకు హీరో రవితేజ హాజరుకాకపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత తమ్ముడిని చివరి చూపు చూడకపోవడంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మీడియాలోనూ, సోషల్ మీడియాలోను వెల్లువెత్తున్న విమర్శల తీవ్రతను తగ్గించేందుకు రవితేజ ఇటీవల ఓ దినపత్రికతో అనుభవాలను పంచుకొన్నారు. సోదరుడు భరత్ మరణంతో రవితేజ కుటుంబం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సంగతి తెలిసిందే.

     నాకు ఇష్టమైన వారు మరణిస్తే తట్టుకోలేను

    నాకు ఇష్టమైన వారు మరణిస్తే తట్టుకోలేను

    తనతో ఎక్కువ అనుబంధం ఉన్న వ్యక్తులు తుదిశ్వాస విడిచితే తాను తట్టుకోలేను. వారి భౌతికకాయాన్ని ఎప్పుడూ సందర్శింలేదు. రెండు మూడు రోజుల తర్వాత వారిని పరామర్శించడం నాకు అలవాటు అని రవితేజ వివరించారు. భరత్ మరణించిన వార్త తెలిసిన తర్వాత మా ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, వారికి మనోధైర్యం చెప్పడానికి చాలా కష్టమైందని ఆయన వివరించారు.

    నా తల్లి కుప్పుకూలింది

    నా తల్లి కుప్పుకూలింది

    భరత్ మరణవార్త వినగానే నా తల్లి కుప్పకూలింది. 85 ఏళ్ల వయస్సు ఉన్న మా నాన్న ఆరోగ్యం పరిస్థితి చాలా గంభీరంగా ఉంది. ఈ వార్త తెలిసినా గానీ, భరత్ శవం చూసినా గానీ ఊహించని పరిస్థితులు చోటుచేసుకొనే స్థితి నెలకొని ఉంది. అందుకే మనసు కఠినం చేసుకొని భరత్ అంత్యక్రియలకు దూరంగా ఉన్నాం అని చెప్పారు.

    మేము చూస్తే తట్టుకోలేం

    మేము చూస్తే తట్టుకోలేం

    అందుకే నా మరో సోదరుడు రఘును ఉస్మానియా హాస్పిటల్‌కు పంపించి ఫార్మాలిటీస్ పూర్తి చేశాం. భరత్ దేహం చాలా దారుణమైన స్థితిలో ఉంది. మేము చూస్తే తట్టుకోలేం అని సన్నిహితులు చెప్పారు. అందుకే అంత్యక్రియలకు వెళ్లలేదు అని రవితేజ అన్నారు.

    తల్లిదండ్రులు షాక్ గురయ్యారు..

    తల్లిదండ్రులు షాక్ గురయ్యారు..

    భరత్ మరణవార్తతో నా తల్లిదండ్రులు చాలా షాక్ గురయ్యారు. వారు సాధారణ స్థితికి చేరుకోవడానికి చాలా సమయం పట్టేలా ఉంది. భరత్ లేడన్న పరిస్థితి నుంచి వారిని బయటపడేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ విషయంలో ఎవరు ఎలా అనుకొన్న ఫర్వాలేదు అని రవితేజ్ చెప్పుకొచ్చారు.

    శ్రీహరి అంత్యక్రియలకు హాజరుకాలేదు..

    శ్రీహరి అంత్యక్రియలకు హాజరుకాలేదు..

    నా సన్నిహితులు అయిన వారు చనిపోతే తట్టుకోలేను. నన్ను ఓ రకమైన భయం వెంటాడుతుంటుంది. పరిశ్రమలో పెద్దలు చనిపోయినా నేను వెళ్లను. ఆ తర్వాత వారి కుటుంబాలను పరామర్శిస్తాను. నటుడు శ్రీహారి నాకు చాలా మంచి మిత్రుడు. ఆయన చనిపోయినప్పుడు కూడా నేను వెళ్లడానికి భయపడ్డాను. అలాంటి ప్రాంతాలకు వెళ్లడానికి నా హృదయం తట్టుకోలేదు. మేను నటులమైనప్పటికీ మాకు భావోద్వేగాలు ఉంటాయి అని రవితేజ అన్నారు.

    English summary
    Actor Ravi Teja's brother Bharath passed away in a road accident recently. Many of them were angry on Ravi Teja for skipping his brother last rites. Ravi Teja revealed the facts why he had skipped the funeral service. He said.. When Srihari passed away, I tried my best to see his mortal remains. That's my weakness!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X