రవితేజ కందిరీగ లో హీరోయిన్స్ వాళ్ళే?
రవితేజ, కృష్ణవంశీ కాంబినేషన్లో ప్రారంభకానున్న కందిరీగ చిత్రంలో హీరోయిన్స్ గా సమీరా రెడ్డి,స్నేహా ఉల్లాల్ నటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు వారితో నిర్మాత బెల్లంకొండ సురేష్ ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కందిరీగ చిత్రం సోషియో ఫాంటసీ అని తెలుస్తోంది. ఈ చిత్రంలో రవితేజ..శ్రీకృష్ణదేవరాయులు ముని మనవడుగా కనిపిస్తారని అప్పట్లో కృష్ణవంశీ చెప్పారు. అయితే ఇప్పుడు పూర్తిగా స్క్రిప్టు మార్చాడని అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం రవితేజ..బెల్లంకొండ నిర్మాతగా చేస్తున్న నాడోడిగల్ రీమేక్ లో చేస్తున్నారు. శంభో..శివ..శంబో పేరుతో తయారతువుతున్న ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియమణి చేస్తోంది.
రవితేజ బెల్లంకొండ సురేష్ కృష్ణవంశీ శ్రీకృష్ణదేవరాయులు శంభో శివ శంబో కందిరీగ సమీరా రెడ్డి స్నేహా ఉల్లాల్ sameera sneha ullal ravi teja krishna vamsi kandireega bellamkonda suresh


Click it and Unblock the Notifications