వేడిక్కిస్తున్న రవితేజ, కాజల్ రొమాన్స్ (ఫోటోలు)

By Srikanya

హైదరాబాద్: రవితేజ, కాజల్ కాంబినేషన్ లో 'సారొచ్చారు' టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పరుసరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్,రవితేజ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు. వాటికి సంభందించిన కొన్ని ఫోటోలు మీడియాకు విడుదల చేసారు.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ భారీగా నిర్మిస్తున్నారు. రవితేజ తరహా కామిక్ టచ్ తో, యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు చెప్తున్నారు.

ఈ చిత్రానికి మొదటి నుంచీ పాజిటివ్ టాక్ ఉంది. రవితేజ సినిమాలు వరసగా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవుతున్నప్పటికీ ఈ చిత్రం గ్యారెంటీగా సక్సెస్ అవుతుందంటున్నారు. కాజల్ తో గతంలో రవితేజ..వీర లో కనిపించనప్పటికీ ఈ చిత్రం తన కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం అవుతుందంటున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో రవితేజ చెప్పే డైలాగులకు థియోటర్స్ మారు మ్రోగుతాయని కాన్ఫిడెన్స్ గా దర్శక,నిర్మాతలు ఉన్నారు.

వేడిక్కిస్తున్న రవితేజ, కాజల్ రొమాన్స్

మినిమమ్ హిట్ గ్యారంటీ హీరోగా ఉన్న రవితేజను ఈ మధ్య వరుసగా ప్లాపులు పలకరిస్తున్నాయి. రవితేజ నటించిన వీర, నిప్పు, దొంగల ముఠా, దరువు చిత్రాలు బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టాయి. తాజాగా రవితేజ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘దేవుడు చేసిన మనుషులు' చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. దాంతో రవితేజ దృష్టి మొత్తం ఈ చిత్రం మీదే పెట్టి చేస్తున్నారు.

వేడిక్కిస్తున్న రవితేజ, కాజల్ రొమాన్స్

గతంలో రవితేజ-పరశురామ్ కాంబినేషన్లో ‘ఆంజనేయులు' అనే ప్లాపు మూవీ వచ్చినప్పటికీ ఈ సారి మాత్రం సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారు అశ్వినీదత్. మరో వైపు రవితేజ ‘బలుపు' అనే చిత్రానికి కూడా కమిట్ అయ్యారు. గోపీచంద్‌ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

వేడిక్కిస్తున్న రవితేజ, కాజల్ రొమాన్స్

గతంలో రింగ రింగ, కెవ్వు కేక లాంటి హాట్ ఐటం నెంబర్లు కంపోజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్... ‘సారోచ్చారు' చిత్రం కోసం ‘రచ్చ రంబోలా' అనే మసాలా సాంగును కంపోజ్ చేస్తున్నారు. ఈచిత్రంలో రవితేజ సరసన కాజల్, రిచా గంగోపాధ్యయి హీరోయిన్లుగా చేసారు.

వేడిక్కిస్తున్న రవితేజ, కాజల్ రొమాన్స్

ఈ చిత్రంలో మరో యంగ్ హీరో నారా రోహిత్ స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఆ పాత్ర కథను కీలకమైన మలుపు తిప్పనుందని తెలుస్తోంది. గతంలో పరుసరామ్,నారా రోహిత్ కాంబినేషన్ లో సోలో అనే చిత్రం రూపొందింది. ఈ అనుబంధంతో ఈ ప్రత్యేక పాత్రకు నారా రోహిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు నిమిత్తం రవితేజ రెమ్యునేషన్ తీసుకోకుండా కేవలం షేర్ మాత్రం తీసుకునేటట్లు ఎగ్రీ అయ్య శక్తి ప్లాప్ తో లాస్ లో ఉన్న నిర్మాతకు భారం తగ్గించాడని తెలుస్తోంది.

వేడిక్కిస్తున్న రవితేజ, కాజల్ రొమాన్స్

ఈ చిత్రంలో రవితేజ ఫుట్ బాల్ కోచ్ గా నటించనున్నారు. ఇటీవలే ఊటీలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది.ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మాస్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో రవితేజ సరసన కాజల్, రిచా గంగోపాధ్యయ్ హీరోయిన్లుగా చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X