ప్రభాస్, రవితేజలతో..జంటహీరోయిన్లు..భలేగమ్మత్తుగా...
'మిస్టర్ పర్‌ఫెక్ట్"లో ప్రభాస్ తో జత కట్టిన కాజల్, తాప్సీ.. 'వీర" చిత్రంలో రవితేతో జోడీ కడుతున్న విషయం తెలిసిందే. 'మిస్టర్ పర్‌ఫెక్ట్" అనంతరం కాజల్ నటించగా విడుదలయ్యే చిత్రం.. తాప్సీ నటించగా విడుదలయ్యే చిత్రం 'వీర" కావడం కూడా ఇక్కడ మరో విశేషం!మొన్నవిడుదలైన 'మిస్టర్ పర్‌ఫెక్ట్"లో మొదటి హీరోయిన్ కాజల్ కాగా, రెండో హీరోయిన్ గా తాప్సీ నటిస్తోంది. రవితేజ టైటిల్ పాత్ర పోషిస్తున్న'వీర"లోనూ కాజల్ ఫస్ట్ హీరోయిన్ కాగా, తాప్సీ సెకండ్ హీరోయిన్ కావడం చర్చనీయాంశమవుతోంది. ఇద్దరు హీరోయిన్లు వరుసగా రెండు సినిమాల్లో ఫస్ట్ అండ్ సెకండ్ హీరోయిన్లుగా నటిస్తుండడం భలేగమ్మత్తుగా...అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
'ఝుమ్మంది నాదం" చిత్రంతో తెలుగు తెరంగేట్రం చేసిన తాప్సీ.. ఆ తర్వాత 'వస్తాడు నా రాజు" చిత్రంలో నటించింది. వరుసగా రెండు సినిమాల్లో మెయిన్ హీరోయిన్‌గా నటించిన తాప్సీ.. ఆ తర్వాత వరుసగా రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించడం, ఈ రెండు సినిమాల్లోనూ కాజలే హీరోయిన్ కావడం ఆసక్తికరంగా మారుతోంది.మెయిన్ హీరోయిన్ గా రంగప్రవేశం చేసి, సెకండ్ హీరోయిన్ గా నటించేందుకు అభ్యంతరం చెప్పని తాప్సీ ఈ రెండు చిత్రాల తర్వాత హీరోయిన్ గా తన కెరీర్ గ్రాఫ్ ను పెంచుకుంటుందేమో చూడాలి.. వేచి చూడాల్సిందే!


Click it and Unblock the Notifications











