పక్కా మాస్ మసాలా( రవితేజ 'బలుపు' ప్రివ్యూ)
హైదరాబాద్: . 'డాన్ శీను'తో దర్శకుడిగా పరిచయమైన గోపీచంద్ మలినేని ఆ తర్వాత 'బాడీగార్డ్' రూపొందించారు. ఇప్పుడు రవితేజ 'బలుపు'ని చూపించబోతున్నారు. ఈ చిత్రం ఈ రోజు( శుక్రవారం) విడుదలవుతోంది. వరస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని పూర్తి నమ్మకం పెట్టుకున్నారు. ఈ చిత్రం ట్రైలర్స్ ఇప్పటికే మంచి క్రేజ్ క్రియేట్ చేసాయి.
ఈ చిత్రంలో రవితేజ పేరు బలుపు శంకర్. పాత్ర తీరుకి తగ్గట్టుగా ఈ పేరును పెట్టారు. ప్రేమికురాలికి ఇచ్చిన మాట కోసం హీరో ఏం చేశాడు? వాటి వల్ల ఎదురైన పరిణామాలు ఏమిటన్నది కథలో కీలకాంశం. పక్కా మాస్ మసాలా చిత్రమిదని, ప్రేక్షకులు రవితేజ నుంచి వినోదాన్ని... అదే స్థాయి యాక్షన్ అంశాలూ ఆశిస్తారు. వాటికి తగ్గ విధంగా బలుపు చిత్రాన్ని తీర్చిదిద్దామని మేకర్స్ చెప్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ.. ఎంత బరువైన కథనైనా సున్నితమైన వినోదాన్ని మేళవించి చెబితే ప్రేక్షకులు ఆదరిస్తారు. జంధ్యాల, ఈవీవీ, శ్రీను వైట్ల చిత్రాలు అలాగే ఉంటాయి కదా. 'బలుపు'లో మేం చేసింది అదే. కోన వెంకట్ కథను ఆ విధంగా తీర్చిదిద్దారు. రవితేజ, శ్రుతిహాసన్, బ్రహ్మానందంల మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి. శ్రుతి ఇప్పటి వరకూ గంభీరంగా ఉండే పాత్రల్లోనే కనిపించింది. ఇందులో వినోదాన్ని పండిస్తూ హుషారుగా నటించింది. ఈ మధ్య ఐపీఎల్‌లో బాగా ప్రాచుర్యం పొందిన జంపింగ్ జంపాంగ్ డాన్స్, గంగ్‌నమ్... అందర్నీ నవ్విస్తాయి అన్నారు.
ఈ చిత్రంలో డాన్‌లు, మాఫియా ముఠాలు కనిపించవు. ఇది రౌడీయిజం నేపథ్యంగా సాగుతుంది. ఈ కథ విశాఖపట్నం చుట్టూ తిరుగుతుంది అని ఆయన అన్నారు. అలాగే నా మొదటి సినిమా డాన్ శీనులో రవితేజ కొన్ని సన్నివేశాల్లో మూగవాడిగా కనిపించి నవ్వించారు. ఇందులో ఆత్మ రూపంలో కనిపించి నవ్విస్తారు అని చెప్పారు.
నటీనటులు : రవితేజ, శృతి హాసన్, అంజలి, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రావు రమేష్, అలీ, అశుతోష్ రాణా, అడవి శేషు, సుప్రీత్, ఆదిత్య మీనన్, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, శేఖర్, అజయ్, షఫీ, శ్రీనివాస్ రెడ్డి, సన, రాజశ్రీ నాయర్ తదితరులు
కథ, మాటలు: కోన వెంకట్
పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, భాస్కర భట్ల,
ఫైట్స్: స్టన్ శివ,
కొరియోగ్రఫీ: రాజు సుందరం, బృంద
ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్,
ఎడిటింగ్: గౌతం రాజు,
సినిమాటోగ్రఫీ: జైనన్ విన్సెంట్,
సంగీతం: థమన్,
నిర్మాత: పరమ్ వి. పొట్లూరి.
విడుదల తేదీ :28/06/2013


Click it and Unblock the Notifications











