రవితేజ ‘బలుపు’ రిలీజ్ ఎప్పుడంటే...?

రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'బలుపు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం 2013 మే నెలలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన శృతి హాసన్, అంజలి హీరోయిన్లుగా చేస్తున్నారు.
పివిపి సినిమా బేనర్ పై గతంలో రవితేజతో వీడింతే చిత్రం రూపొందించిన ప్రసాద్ వి.పొట్లూరి 'బలుపు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు రవితేజతో గోపీచంద్ మలినేని 'డాన్‌శీను' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈచిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ స్క్రిప్టు రచయితగా పని చేస్తున్నారు.
ఈ చిత్రంలో రవితేజ క్యారెక్టర్ కామెడీని పండిస్తూ యాక్షన్ సీన్లతో అదరగొట్టేదిగా ఉంటే... శృతి హాసన్ క్యారెక్టర్ రవితేజకు తగిన జోడీగా ఎంటర్ టైన్మెంట్ పంచుతూ అందాల ఆరబోతతో గ్లామరస్‌గా ఉంటుందని తెలుస్తోంది. మరో హీరోయిన్ అంజలి మెడికో పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాని తమన్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











