రవితేజ ఈజ్ బ్యాక్: 'బెంగాల్‌ టైగర్‌' టీజర్ (వీడియో)

By Srikanya

హైదరాబాద్‌: శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై రవితేజ, తమన్నా, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'బెంగాల్‌ టైగర్‌'. ముందుగా చెప్పినట్లుగానే ఈ చిత్రం టీజర్‌ను ఈ బుధవారం ఉదయం 10.30 గంటలకు విడుదల చేసారు. అదేవిధంగా ఆడియోను ఈనెల 18న విడుదల చేయనున్నట్లు తెలిపారు. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కె.కె. రాధామోహన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ టీజర్ ని సంపత్ నంది తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా అభిమానులకు అందించారు. మీరూ ఈ టీజర్ ని చూసి అభిప్రాయాలను క్రింద కామెంట్స్ భాక్స్ లో తెలియచేయండి

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సంపత్ నంది మాట్లాడితే... పులి పంజా విసిరిందంటే ఇక తిరుగులేనట్టే. అదే పులి ఓ పథకం ప్రకారం పంజా విసిరితే? పౌరుషమున్న ఒక పులి అదే చేసింది. మరి అక్కడ ఏం జరిగిందో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు సంపత్‌ నంది.

దర్శకుడు కంటిన్యూ చేస్తూ.. ''పేరుకు తగ్గట్టుగా బలమైన కథతో రూపొందుతున్న చిత్రమిది. యాక్షన్‌, భావోద్వేగాలు, వినోదం మేళవించి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. రవితేజ హుషారైన నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. బెంగాల్‌ టైగర్‌ అంత పవర్‌ రవితేజ పాత్రలో కనిపిస్తుంది'' అన్నారు.

Ravi Teja's Bengal Tiger teaser released

''చిత్రీకరణ తుదిదశకు చేరుకొంది. రవితేజ శైలి మాస్‌ అంశాలతో దర్శకుడు సంపత్‌ నంది చిత్రాన్ని తీర్చిదిద్దుతున్న విధానం చాలా బాగుంది. మా సంస్థలో నిలిచిపోయే ఓ మంచి చిత్రమవుతుంది'' అన్నారు నిర్మాత. రచ్చతో దర్శకుడుగా తన సత్తా ఏంటో చూపించిన దర్శకుడు సంపత్ నంది.. దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'బెంగాల్‌ టైగర్‌'. రవితేజ హీరోగా నటిస్తున్నారు. తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్స్. కె.కె.రాధామోహన్‌ నిర్మాత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X