Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ఇదొక్కటి చాలు : 'బెంగాల్ టైగర్' థియోటర్ ట్రైలర్ (వీడియో)
హైదరాబాద్: రవితేజ, తమన్నా, రాశీ ఖన్నా, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో సంపత్ నంది దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'బెంగాల్ టైగర్'. ఈ సినిమా సరికొత్త థియోటర్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూసిన వారు ఈ ఒక్కటి చాలు బిజినెస్ అవ్వటానికి అన్నట్లు మాట్లాడుకుంటున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె రాధామోహన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.
రవితేజ మాట్లాడుతూ... ''సినిమా బాగా వచ్చింది. బీమ్స్ మంచి పాటలిచ్చాడు. తమన్నా అక్షర దోషాలు లేకుండా తెలుగు బాగా మాట్లాడుతోంది. ఆమెను చూస్తుంటే ముచ్చటేస్తుంది. నాలుగైదు సినిమాల తరవాత రాశీ ఖన్నా ఇలానే తెలుగు మాట్లాడాలి. సంపత్‌కి హ్యాట్రిక్ సినిమా అవుతుందని నా నమ్మకము''అన్నారు.
దర్శకుడు చెబుతూ.... ''నేను ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన వ్యక్తి రవితేజ. ఒకే సిట్టింగ్‌లోనే కథ ఓకే చేశారు. బీమ్స్‌కి నేనేదో లైఫ్ ఇచ్చాననుకొంటున్నారు. ఆ ఘనతా రవితేజగారిదే. రవితేజ అభిమానులకు వెయ్యి శాతం సంతృప్తినిచ్చే సినిమా ఇది''అన్నారు.
రవి తేజ సరసన తమన్న, రాశి ఖన్నాలు ఆడిపాడునున్నారు. సంపత్ నంది రెండవ సినిమా రచ్చలో కూడా తమన్ననే హీరోయిన్ కావడం విశేషం. ఏమైంది ఈ వేళతో ప్రతిభ గల దర్శకునిగా పేరు తెచ్చుకున్నాడు. రెండవ సినిమాతోనే రామ్ చరణ్ సినిమాకు దర్శకత్వం చేశాడు. రచ్చ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్2 కు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది.
ఆ సినిమా స్రిప్టు తయారు చేసే పనిలో దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయాయి. కారణం ఏంటో తెలియదు కాని ఆ సినిమా నుంచి సంపత్ నంది తప్పుకున్నాడు. అనూహ్యంగా రవితేజాను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. రవితేజకు తమన్నతో తొలి సినిమా. తమన్న తన అందచందాలతో మురిపించబోతోంది.