రవితేజ పుట్టిన రోజు వేడక..స్టార్ డైరక్టర్స్ తో (ఫొటోలు)
హైదరాబాద్: ప్రేక్షకుడు థియేటర్లో అడుగుపెట్టేది వినోదం కోసమే...' అని నమ్మి, ఈ సూత్రం ప్రకారం కథల్ని ఎంచుకొని, తన పాత్రల్ని మలచుకొని, తన కెరీర్‌ని తీర్చిదిద్దుకొన్న కథానాయకుడు రవితేజ. తెరపై హుషారుగా సాగిపోయే హీరోయిజానికి రవితేజ సినిమాలు పెట్టింది పేరు. 'పైసా వసూల్' సినిమాకు కేరాఫ్ అడ్రస్ ఆయనే. 'ఆటోగ్రాఫ్', 'నేనింతే'లాంటి కొత్తతరహా కథలు ఎంచుకొని తనలోని నటుడిని సంతృప్తిపరచుకొన్నాడు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
''అటు ప్రేక్షకుల్నీ, ఇటు నిర్మాతల్నీ సంతోషపెట్టే కథలే ఎంచుకొంటాను. ముందు నుంచీ నా ప్రయాణం ఇలానే సాగింది. ఇక ముందు కూడా ఇంతే. డబ్బులు రాని ప్రయోగాలు చేయడం నాకు ఇష్టం ఉండదు'' అని చెప్తుంటారు రవితేజ.
అన్నట్టు... ఈ రోడు రవితేజ జన్మదినం. పవర్'ఫుల్' పోలీస్: మాస్ అంటే బస్‌పాస్ కాదు... ఎవడుపడితే వాడు వాడేసుకోవడానికి. అది మన బలుపు, బాడీలాంగ్వేజ్ బట్టి జనం పిలుచుకునే పిలుపు అంటూ హిట్ కొట్టారు రవితేజ. ఆ ఉత్సాహంతో రవితేజ పుట్టిన రోజు ని జరుపుకుంటూ తన సన్నిహిత దర్శకులతో జరుపుకున్నారు. ఎవరా దర్శకులు అనేది క్రింద ఫొటోలలో చూడండి.

వర్మతో కలిసి
ఈ పుట్టిన రోజు వేడుకలకు రామ్ గోపాల్ వర్మ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆయన దర్శకత్వంలో రవితేజ..హీరోగా..దొంగల ముఠా చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.

బాబీతో...
రవితేజ కు రీసెంట్ గా హిట్ ఇచ్చిన చిత్రం పవర్. ఆ చిత్రం దర్శకుడు బాబీతో కలిసి ఇలా..

బలుపుతోనే బంధం
బలుపు చిత్రానికి సైతం బాబీనే కథ ఇచ్చారు. అప్పటినుంచి రవితేజ, బాబీల మధ్య అనుబంధం పెరిగింది.

హరీష్ శంకర్ తో
షాక్, మిరపకాయ అంటూ మాస్ మహారాజుతో సినిమాలు చేసిన హరీష్ శంకర్ అంటే రవితేజకు ప్రత్యేక అభిమానం

పార్టీలో
పార్టీలో భాగంగా వర్మగారు ఏదో చెప్తూంటే శ్రద్దగా రవితేజ తదితరులు వింటున్నారు.

మంచు ఫ్యామిలీ
ఈ పంక్షన్ లో మంచు ఫ్యామిలీ నుంచి మనోజ్, లక్ష్మి ప్రసన్న కూడా వచ్చారు. వారు ఇదిగో ఇలా ఫోజిచ్చారు.

సుబ్బరాజుతో
ఆర్టిస్టు సుబ్బరాజు తో మొదటి నుంచి రవితేజకు ప్రత్యేకాభిమానం. రవితేజ చిత్రాలన్నిటిలో సుబ్బరాజు ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తున్నారు.

అందరూ
రవితేజ పుట్టిన రోజు సందర్బంగా అందరూ ఇదిగో ఇలా ఎంజాయ్ చేసారు

పూరితో
పూరి జగన్నాథ్, రవితేజ ల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిది హిట్ కాంబినేషన్.

అందరితో
రవితేజకు అందరితో మంచి రిలేషన్ షిప్ ఉంది. దాంతో ఆయన పుట్టిన రోజు అంటే అందరూ ఉషారుగా హాజరయ్యారు

బెంగాల్ టైగర్
రవితేజ, సంపత్ నంది కాంబినేషన్ లో రూపొందనున్న బెంగాళ్ టైగర్ చిత్రం ఇప్పటికే ఎనౌన్స్ చేసారు

కిక్ 2
సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న కిక్ 2 చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.


Click it and Unblock the Notifications











