»   » మద్యం మత్తులో రవితేజ సోదరుడు హల్‌చల్, అరెస్ట్

మద్యం మత్తులో రవితేజ సోదరుడు హల్‌చల్, అరెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
 Ravi Teja's brother Bharat arrested for making nuisance
హైదరాబాద్: రవితేజ సోదరుడు మరోసారి అరెస్టు అయ్యాడు. గతంలో ఓసారి డ్రగ్స్ కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు చేయగా.....తాజాగా మద్యం మత్తులో వీరంగం సృష్టించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక భరత్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

భరత్‌పై ఐపీసీ 186,290 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఉదయం మియాపూర్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. పబ్లిక్ న్యూసెన్స్ కేసుతో పాటు, అతిగా మద్యం సేవించి వాహనం నడిపినందు వల్ల అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కూడా నమోదు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక మాదాపూర్‌లో భరత్ రోడ్డుపై వాహనం నిలిపి హల్ చల్ చేసాడు. విషయం అందుకున్న మాదాపూర్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పోలీసుల పట్ల కూడా భరత్ దురుసుగా ప్రవర్తించాడు. వారిపై దాడికి ప్రయత్నించినట్లు సమాచారం. దీంతో అతన్ని అరెస్టు చేసారు.

అయితే ఈ సంఘటనపై స్పందించేందుకు హీరో రవితేజ నిరాకరించారు. మంగళవారం సాయంత్రం భరత్ బెయిల్‌పై విడులయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా పరిశ్రమలో మంచి పేరున్న రవితేజ....సోదరుల వ్యవహార శైలి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటుండటం చర్చనీయాంశం అయింది.

English summary
Ravi Teja's brother Bharat arrested for making nuisance. It is not the first time that Bharat got arrested he was already arrested long back for same issue and now he is again booked under same issue.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu