twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భరత్ నిన్న కూడా డ్రగ్స్ తీసుకున్నాడా..? భరత్ రాజు మృతిలో అనుమానాలు

    భరత్ రాజు ప్రమాదం ఘటనలో ప్రమాదం జరిగాక జరిగిన పరిణామాలే అనుమాలకు తావిచ్చేలా ఉన్నాయి, అంత గోప్యత పాటించాల్సిన అవసరం ఏముంది.?

    |

    భరత్ ఎప్పుడూ వివాదస్పదమైన రీతిలోనే ఉన్నాడు. గతంలో కూడా పోలీసులను ధూషించిన కేసులో జైలుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల కావడం జరిగింది. ఇవే కాకుండా డ్రంకెన్ డ్రైవ్‌‌, డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. భరత్ డ్రగ్స్ సేవిస్తూ, పవిత్రమైన తిరుమలలో సిగరెట్ దమ్ము లాగుతూ... ఇలాంటి వెకిలి చేష్టలతో తన పరువు ఎలాగో తీసుకున్నాడు.

    చేసిన తప్పే పదేపదే చేస్తూ

    చేసిన తప్పే పదేపదే చేస్తూ

    మామూలు గా తన జీవితం ఎలా అయినా ఉండనీ కనీసం తన అన్న, టాలీవుడ్ మాస్ హీరో రవితేజ పరువైనా కాపాడాడా అంటే అదీ లేదు. చేసిన తప్పే పదేపదే చేస్తూ చిల్లర వేషాలు వేస్తూ వివాదాస్పదంగా మారాడు. పోలీసులు, మీడియాకి ఎప్పుడూ "టచ్" లోఉంటూ కెరీర్ మొత్తం అవే రకం వివాదాల్లో చిక్కుకు పోయాడు భరత్ రాజు..

    డిప్రెషన్ వల్లే

    డిప్రెషన్ వల్లే

    నిజమే రవితేజ లాంటి స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా భరత్ కెరీర్ గానీ, రెండో తమ్ముడు రఘు కెరీర్ గానీ టాలీవుడ్ లో సజావుగా సాగలేదు. చిన్నా చితకా పాత్రలు వచ్చినా వాటితో పెద్ద గుర్తింపూ రాలేదు. ఆ డిప్రెషన్ వల్లే వాళ్ళిద్దరూ ఇలా డ్రగ్స్ బానిసయ్యారూ అని అంటారు గానీ.., ఇదే ఇండస్ట్రీ లో కనీస బ్యాక్ గ్రౌండ్ కూడా లేకుండా ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డ రవితేజ ఇప్పుడు స్టార్ హీరోగా నిలబడటం గమనించాల్సిన విషయం.

    తల చిద్రమైపోయింది.

    తల చిద్రమైపోయింది.

    కాగా భరత్ రాజు శనివారం రాత్రి కూడా మద్యం సేవించి కారును డ్రైవ్ చేసి.. ఆగివున్న లారీని ఢీకొన్నాడని తెలుస్తోంది. విపరీతమైన వేగం తో వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకోట్టటం తో ముందు భాగం మొత్తం లారీ ట్రాలీ కిందకు వెళ్ళిపోయి భరత్ తల చిద్రమైపోయింది.

    అనుమానాలకు తావిస్తోంది.

    అనుమానాలకు తావిస్తోంది.

    ప్రమాదం జరిగాక జరిగిన పరిణామాలే అనుమాలకు తావిచ్చేలా ఉన్నాయి. ఈ ఘటన శనివారం రాతి పదకొండు గంటలకు జరిగితే తెల్లవారే వరకు దాదాపు పది గంటల పాటు మీడియాకి, పోలీసులకీ కూడా తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఇంత గోప్యత పాటించాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది.

    డ్రగ్స్ తీసుకున్నాడా

    డ్రగ్స్ తీసుకున్నాడా

    మామూలుగా ఎక్కువ మోతాదు లోనే డ్రగ్స్ తీసుకునే అలవాటున్న భరత్ నిన్న కూడా డ్రగ్స్ తీసుకున్నాడా..? లేక అతనితో పాటు కూడా కొద్ది మొత్తం లో అలాంటి పదార్థాలేమైనా ఉండి ఉండోచ్చా? అన్న అనుమానం కూడా వినిపించింది. ఇవితప్ప మరీ అన్ని గంటల పాటు భరత్ కి జరిగిన ప్రమాద విషయం, ఆయన మరణం దృవీకరించుకున్నాక కూడా పోలీసులకు సమాచారం చేర వేయటం లో జాప్యం, చేయటానికి వేరే కారణాలైతే కనిపించటం లేదు.

    English summary
    Raviteja's brother and actor Bharath Raju died in a car crash on Saturday night. But News broke out only on Sunday morning. Police are investigating the reasons for the accident.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X