రవితేజ-పూరి ‘దేవుడు చేసిన మనుషులు’ లోగో
మాస్ మహరాజ్ రవితేజ, క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటంగ్ బ్యాంకాక్‌లో జరుపుకుంటోంది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 15న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఖతర్నాక్, కిక్ చిత్రాల తర్వాత రవితేజ మరోసారి ఇలియానాతో ఈచిత్రంలో జతకడుతున్నాడు.
ఈ చిత్రం ఈ వేసవికి “సైలంట్ కిల్లెర్ " కాబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. రఘు కుంచె ఈ చిత్రానికి సంగీతం అందించారు. బి వి ఎస్ ఎం ప్రసాద్ ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి నిర్మిస్తున్నారు.
చిత్ర యూనిట్ సభ్యుల నుంచి విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రంలో రవితేజ, ఇలియానా అనాధలుగా నటిస్తున్నారని సమాచారం. పూరి గత చిత్రాల కంటే భిన్నంగా, ఒక విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 'దేవుడు చేసిన మనుషులు' అని ఓల్డ్ టైటిల్ పెట్టడం వెనక కూడా ఓ ప్రత్యేకత ఉందట.
రవితేజ సరసన గ్లామర్ స్టార్ ఇలియానా నటిస్తున్న ఈసినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎంఎస్ నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు, ఫిష్ వెంకట్, జ్యోతిరానా తదితరలు నటిస్తున్నారు. సంగీతం : రఘు కుంచె, ఎడిటింగ్ : ఎస్ ఆర్ శేఖర్, నిర్మాత : బివిఎస్ఎం ప్రసాద్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : పూరి జగన్నాథ్


Click it and Unblock the Notifications











