డిసెంబర్ 6.. ఫిక్స్ అయిన మాస్ మహారాజ్.. డిస్కో హంగామా షురూ
మాస్ మహారాజ్ రవితేజ రంగం లోకి దిగేందుకు రెడీ అయ్యాడు. గత కొంతకాలంగా సరైన హిట్ పడక సతమతమౌతున్న ఆయన ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ సాధించాలనే కసితో వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' స్టార్ట్ చేశాడు. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. రవితేజ అభిమానుల టేస్ట్‌కి సరిపోయేలా ఈ సినిమా తెరకెక్కుతోంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'డిస్కో రాజా' చివరి దశకు చేరుకుంది. ఈ మేరకు ప్రమోషన్ కార్యక్రమాలు మరింత వేగవంతం చేయనున్నారు యూనిట్ సభ్యులు. ఇందులో భాగంగా చిత్ర టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి 'డిస్కో రాజా' టీజర్ మ్యాజిక్ చేయనుందని అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్.

ఇప్పటికే 'డిస్కో రాజా' నుంచి విడుదలైన మొదటి పాట 'నువ్వు నాతో ఏమన్నావో' మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సైన్స్ ఫిక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, ప్రియాంక జవల్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రంలో రవితేజ రెండు డిఫెరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నాడు. వృద్దుడిగా, యువకుడిగా రవితేజ నటన అబ్బురపరచనుందని తెలుస్తోంది. ఇటీవలే ఈ చిత్ర విడుదల తేదీని జనవరి 24 అని పేర్కొంటూ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. 'డిస్కో రాజా'పై రవితేజ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications











