దాడుల్లో రవితేజ తండ్రి భూపతిరాజు రాజగోపాల్‌రాజు పట్టుబడ్డారు
పేకాట క్లబ్‌పై పోలీసులు దాడిచేసి 46 మందిని అరెస్ట్ చేశారు. మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఈ దాడుల్లో ప్రముఖ తెలుగు సినిమా హీరో రవితేజ తండ్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం రాణిగంజ్‌లో గోల్డెన్‌పార్క్ క్లబ్ పేరిట గత కొద్ది రోజుల నుంచి ఒక పేకాట క్లబ్ నడుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం సాయంత్రం మహంకాళి స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రంగారావు నేతృత్వంలో పోలీసులు క్లబ్‌పై దాడి చేశారు. ఆ సమయంలో పేకాడుతూ 46 మంది పట్టుబడ్డారు. నిందితుల నుంచి రూ. 38,300 నగదు, 46 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో రవితేజ తండ్రి భూపతిరాజు రాజగోపాల్‌రాజు కూడా ఉన్నారు. కాగా, పోలీసులు సదరు హీరో తండ్రిని మీడియా కంటపడకుండా వేరుగా ఒక గదిలో కూర్చోబెట్టడం గమనార్హం. అయితే రాజగోపాల్‌రాజుకు కొద్దిగా అనారోగ్యంగా ఉండటంతో వేరుగా కూర్చోబెట్టినట్లు ఇన్‌స్పెక్టర్ రంగారావు మీడియా కు తెలిపారు. రవితేజ కు ఇటీవలికాలంలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొద్ది నెలల క్రితం అతని తమ్ముడు మాదకద్రవ్యాలు కొంటూ పట్టుబడ్డాడు. ఇప్పుడు తండ్రికి సంబంధించి క్లబ్ లో పేకాడుతూ పట్టుబడడం కొంచెం చికాకు కలిగించే అంశమే. సెలెబ్రిటీస్ విషయంలో ఇలాంటి సమస్యలు తప్పవేమో.రవితేజ కు సంబందం లేకపోయినా, ఆయనకు సంబందించిన వారు ఏ చిన్న తప్పు చేసినా, ఈయన పేరు కూడా బయటకి వస్తుంటుంది.


Click it and Unblock the Notifications











