Just In
- 7 min ago
కాపీక్యాట్ ఆరోపణలు.. మరి కేసులు ఎందుకు పెట్టలేదు.. కౌంటర్ ఇచ్చిన థమన్
- 24 min ago
తమిళ బిగ్ బాస్‌లోకి దేత్తడి హారిక: ఏకంగా కమల్ హాసన్‌తోనే అలా.. అరుదైన ఘనత సొంతం!
- 54 min ago
బీరు తాగుతూ.. సిగరెట్ కాల్చుతూ ఆరియానా రచ్చ: కలకలం రేపుతోన్న బోల్డ్ బ్యూటీ హాట్ వీడియో
- 1 hr ago
ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుంచి ఊహించని అప్డేట్: వాళ్లందరినీ చూపించిన దర్శకుడు ఓం రౌత్
Don't Miss!
- News
extra aunty: భార్యతో సరసాలకు నో సిగ్నల్. రెచ్చి పోయిన ఆంటీ, అత్త కొంపకు నిప్పు పెట్టిన అల్లుడు !
- Finance
అదానీ గ్రూప్‌లో రూ.18,200 కోట్ల పెట్టుబడి, టోటల్ భారీ డీల్
- Sports
లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 83/1! గెలవాలంటే 245 కొట్టాలి!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హ్యాపీ బర్త్ డే రవితేజ (‘కిక్-2’ ఫస్ట్ లుక్)
హైదరాబాద్ : చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ కష్టపడి పైకొచ్చిన అతి కొద్ది మందిలో ఒకరు రవితేజ. హీరోగా తానేంటో ఎప్పుడో నిరుపించుకున్నారు. వయసు 46 ఏళ్లు దాటినా అది కనిపించకుండా కుర్ర హీరోలతో పోటీపడగల సత్తా అతడిది. రవితేజ సినిమా అంటే మినిమం గ్యారంటీ, అతని సినిమా అంటేనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందుకే అతడితో సినిమాలు తీయడానికి నిర్మాతలు, దర్శకులు ఇష్టపడతారు.
1968 జనవరి 26న జన్మించిన రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట ఆయన జన్మస్థలం. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన రవితేజకు కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘సింధూరం' చిత్రంలో ముఖ్య పాత్ర పోషించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా నీ కోసం సినిమాతో రవితేజ హీరోగా పరిచయమయ్యాడు.
ఆ చిత్రంలో ఆయన నటనకు పలువురి ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది. తరువాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అవును వాళ్లు ఇద్దరూ ఇష్ట పడ్డారు, ఇడియట్, ఖడ్గం, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, భద్ర, విక్రమాక్కుడు, దుబాయ్ శ్రీను, కృష్ణ, కిక్, మిరపకాయ్, బలుపు, పవర్ చిత్రాలతో రవితేజ తన పరంపరను కొనసాగిస్తున్నారు.

బర్త్ డే స్పెషల్
ఓ వైపు రిపబ్లిక్ డే, అదే రోజు రవితేజ బర్త్ డే పురస్కరించుకుని ఆయన తాజా సినిమా ‘కిక్-2' ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

ఫ్యాన్స్ కోరుకునే అంశాలతో..
ఇటీవలే ‘పవర్' చిత్రంతో మాస్ మసాలా హిట్ కొట్టిన రవితేజ ఈచిత్రంతో కూడా మరో విజయం అందుకోవడం ఖాయమని అంటున్నారు అభిమానులు. గతంలో వచ్చిన ‘కిక్' చిత్రానకి ఇది సీక్వెల్.

కిక్-2
రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్' చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇపుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా రవితేజ హీరోగా నటించే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై హీరో కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. కిక్ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

స్టోరీ
ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమని రవితేజ అన్నారు. 'కిక్'లో జంటగా నటించిన రవితేజ, ఇలియానా పాత్రల కొడుకు కథే ఈ 'కిక్ 2' అని దర్శకుడు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ...యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవితేజ మార్క్ ఎంటర్‌టైనర్‌తోపాటు సురేందర్ రెడ్డి, తమన్నా మ్యాజిక్ మళ్లీ రిపీట్ కానుంది. ఈ చిత్రం మే 28, 2015న విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. కథ:వక్కంతం వంశి, కెమెరా:మనోజ్ పరమహంస, సంగీతం:తమన్, నిర్మాత:నందమూరి కళ్యాణ్‌రామ్, దర్శకత్వం:సురేందర్ రెడ్డి.