నందమూరి హీరో నిర్ణయం బాగుంది

By Srikanya

హైదరాబాద్ : నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పుడు ట్రేడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారారు. తను హీరోగా కాకుండా రవితేజ హీరోగా చిత్రం రూపొందించటానికి నిర్మాతగా రెడీ అయ్యి అందరి చేతా శభాష్ అనిపించుకుంటున్నారు. రవితేజ కొత్త చిత్రం కిక్ సీక్వెల్ ప్రారంభానికి రెడీ అవుతోంది. కిక్ సీక్వెల్ కావటంతో బిజినెస్ పరంగా మంచి క్రేజ్ ఉంటుందని భావిస్తున్నారు.

రవితేజ, సురేందర్‌రెడ్డి అందించిన వినోదం 'కిక్‌'. బాలీవుడ్‌లోనూ విజయఢంకా మోగించిన చిత్రమిది. ఇప్పుడు అంతకు మించిన కిక్‌ ఇవ్వడానికి రవితేజ సిద్ధమయ్యారు. 'కిక్‌2' పట్టాలెక్కబోతోంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తారు.

Ravi teja's ‘Kick 2′ from August 20th

'రేసుగుర్రం' తరవాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే. ఎన్టీఆర్‌ఆర్ట్స్‌ పతాకంపై హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఈ నెల 20న చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ''కిక్‌'కి మించిన వినోదం ఇందులో ఉంటుంది. రవితేజ పాత్ర శైలి, నటన మరోసారి ప్రేక్షకులకు కావల్సినంత కిక్‌ ఇస్తాయి. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస

సీక్వెల్ లో కేవలం క్యారెక్టరైజేషన్ కంటిన్యూ అవుతుందని అంటున్నారు. అందులో హీరో పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత కిక్ సినిమా ముగుస్తుంది. కాబట్టి సీక్వెల్ లో పోలీస్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఇక హీరోయిన్ గా అనూష్క ని ఎంపిక చేసే అవకాశాలన్నాయి. అలాగే బ్రహ్మానందం హల్వా రాజ్ పాత్ర కొత్త మెలికతో అదరకొడుతుందని అంటున్నారు. అయితే ఈ కథలో మంచి లవ్ స్టోరి ఉండేలా తయారు చేస్తున్నారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X