ఎన్టీఆర్, అల్లు అర్జున్ రవితేజ ‘కిక్- 2’ (ఫోటో)
హైదరాబాద్: రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న కిక్-2 సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈకార్యక్రమానికి యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కిక్-2 చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హీరో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. కిక్ సీక్వెల్ కావటంతో బిజినెస్ పరంగా మంచి క్రేజ్ ఉంటుందని భావిస్తున్నారు. 'రేసుగుర్రం' తరవాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే. 'కిక్'కి మించిన వినోదం ఇందులో ఉంటుందని అంటున్నారు.

రవితేజ పాత్ర శైలి, నటన మరోసారి ప్రేక్షకులకు కావల్సినంత కిక్ ఇస్తాయి. సీక్వెల్ లో కేవలం క్యారెక్టరైజేషన్ కంటిన్యూ అవుతుందని అంటున్నారు. అందులో హీరో పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత కిక్ సినిమా ముగుస్తుంది. కాబట్టి సీక్వెల్ లో పోలీస్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది.
ఇక హీరోయిన్‌గా అనుష్క ని ఎంపిక చేసే అవకాశాలన్నాయి. అలాగే బ్రహ్మానందం హల్వా రాజ్ పాత్ర కొత్త మెలికతో అదరకొడుతుందని అంటున్నారు. అయితే ఈ కథలో మంచి లవ్ స్టోరి ఉండేలా తయారు చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస.


Click it and Unblock the Notifications











