రవితేజ డబుల్ డోస్ ('కిక్‌-2' ప్రివ్యూ)

By Srikanya

హిట్ సినిమాకు సీక్వెల్ చేయటమంటే సినీ జనాలకు మహా ఇష్టం. ఒక సారి ప్రూవ్ అయ్యి,జనాల్లోకి వెళ్లిన టైటిల్, ఆర్టిస్టులు, దర్శకుడు వీటికి ప్లస్ అవుతూంటారు. ఇప్పుడు కిక్ 2 కు అదే జరుగుతోంది. రవితేజ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన 'కిక్‌' కు సీక్వెల్ అలాగే సిద్దమైంది. ఈ సారి కంఫర్ట్ అనే కాన్సెప్టు తో వస్తున్న ఈ చిత్రం పూర్తి కంపర్ట్ ప్రాజెక్టు అంటున్నారు. దానికి తోడు ఈ సారి కేవలం కామెడీని మాత్రమే కాక యాక్షన్ ని కూడా జోడించి వదులుతున్నారు. ఓ రకంగా ఇది కంఫర్ట్ తో కూడిన డబుల్ డోస్ అని చెప్తున్నారు.

ఇందులో రవితేజ రాబిన్ హుడ్ గా కనిపిస్తారు. కథలో ఎక్కువభాగం రాజస్ధాన్ లోని విలాస్ పూర్ అనే గ్రామంలో జరుగుతుంది. ఎన్నారై అయిన రాబిన్ హుడ్ తన ఆస్దులు అమ్మకం కోసం ఇండియా వస్తాడు. అక్కడ రకుల్ ప్రీతితో ప్రేమలో పడతాడు. ఆమెతో డ్యూయిట్స్ పాడుతూ, పండిట్ రవితేజ (బ్రహ్మానందం)ఇంట్లో గెస్ట్ గా ఉంటూ వచ్చిన అతనికి రకుల్ విషయంలో ఓ ట్విస్ట్ పడుతుంది. ఆ ట్విస్ట్ ...విలీస్ పూర్ గ్రామానికి దారి తీస్తుంది. అది సోలామన్ సింగ్ ఠాకూర్ (రవికిషన్) రాజ్యం. అక్కడ అతను ఎంత చెప్తే అంత. అక్కడ జనం చాలా ఇబ్బందులు పడుతూంటారు. అవన్నీ చూసినా కంఫర్ట్ అనే రాబిన్ హుడ్ యాక్షన్ లోకి ఎంట్రీ ఇవ్వటానికి ఇష్టపడడు. అయితే కొన్ని పరిస్దితులు అతన్ని రవికిషన్ పైకి దండెత్తేలా చేస్తాయి. ఆ పరిస్ధితులు ఏంటి...రాబిన్ హుడ్ ఎలా ఆ విలన్ ని ఎదిరించాడు. రకుల్ ప్రీతి సింగ్ లక్ష్యం ఏమిటి అనేది మిగతా కథ.

Ravi teja's ‘Kick 2′ preview

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ కిక్ సిరీస్ లో.... ఫస్ట్ పార్ట్ మొత్తం కామెడీ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇక ఈ రోజున వస్తున్న కిక్ 2... కామెడీ తో పాటు కంఫర్ట్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియెన్స్ ని అలరించబోతోంది.

'కిక్‌ 2' గురించి రవితేజ మాట్లాడుతూ...ఇది 'కిక్‌'కు సీక్వెల్‌ కాదు. రెండూ వేర్వేరు కథలు. 'కిక్‌' శుభం కార్డులో 'కిక్‌ 2' రాబోతోందని హింట్‌ ఇచ్చాం. అయితే అప్పటికి 'కిక్‌ 2' ఆలోచనే లేదు. మూడేళ్ల క్రితం వక్కంతం వంశీ ఓ లైన్‌ చెప్పాడు. దాన్ని రాసుకొంటూ వెళ్తే ఈ సినిమాకి 'కిక్‌ 2' అనే పేరు పెడితే బాగుంటుంది అనిపించింది. 'కిక్‌'లో హీరో పేరు కల్యాణ్‌. 'కిక్‌' అంతా వాడి గోలే. ఇది వాళ్ల అబ్బాయి రాబిన్‌ హుడ్‌ కథ. వీడిదంతా 'కంఫర్ట్‌' గోల.. అదేంటన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది అన్నారు.

ఈ చిత్రం తో తప్పకుండా డబుల్‌ కిక్‌ ఇస్తాం . 'కిక్‌' కంటే ఎక్కువ వినోదం ఉంటుంది. పాటలూ బాగున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా యాక్షన్‌ పార్ట్‌ బాగా వచ్చింది. 'కిక్‌'లో యాక్షన్‌కు అంత చోటు దక్కలేదు. ఈ సినిమాలో మాత్రం పోరాట దృశ్యాలు బాగుంటాయి. ఓ కమర్షియల్‌ సినిమాలో ప్రతి పాత్రకీ ప్రాధాన్యం ఉండడం చాలా అరుదుగా జరిగే విషయం. 'కిక్‌ 2'లో అది సాధ్యమైంది అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ‘కిక్‌'కు సీక్వెల్‌ కాదు. కానీ అందరికీ డబుల్‌ కిక్‌ ఇస్తుంది. ‘కిక్‌'లో రవితేజ, ఇలియానా జంటగా నటించారు. వాళ్లిద్దరి కొడుకు కథే ‘కిక్‌-2'. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో క్లైమాక్స్‌ను భారీగా తెరకెక్కించాం. సినిమాలో హైలెట్ అవుతుంది '' అని తెలిపారు.

నిర్మాత నందమూరి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ.... ‘‘అతనొక్కడే వంటి హిట్‌ తర్వాత సురేందర్‌రెడ్డి మా సంస్థలో చేస్తున్నారు. రవితేజ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను రూపొందిచాం. భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.

బ్యానర్ : ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకం
రవితేజ, రకూల్ ప్రీత్ సింగ్, రవికిషన్, రాజ్ పాల్ యాదవ్, బ్రహ్మానందం, ఆశిష్ విధ్యార్ది, పోసాని తదితరులు.
కథ: వక్కంతం వంశీ,
సంగీతం: యస్‌.యస్‌.థమన్‌,
కెమెరా: మనోజ్‌ పరమహంస,
ఎడిటింగ్‌: గౌతంరాజు,
ఆర్ట్‌: నారాయణరెడ్డి,
ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌.
నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్ రెడ్డి.
విడుదల తేదీ: 21-08-2015.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X